హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డబుల్ విజయం: పోడియంపై అకిల్ అలీభాయ్, నీల్ జానీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కోయంబత్తూర్, నవంబర్17, 2024: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్‌) ఫైనల్ రౌండ్‌ తొలి రోజు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కోయంబత్తూర్, నవంబర్17, 2024: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్‌) ఫైనల్ రౌండ్‌ తొలి రోజు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు డబుల్‌ పోడియం విజయాన్ని నమోదు చేసింది. శనివారం కరీ మోటార్ స్పీడ్‌వేలో జరిగిన ఫార్ములా 4 ఇండియన్ ఓపెన్ ,ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్‌) రేసుల్లో బ్లాక్‌బర్డ్స్ రేసర్లు అకిల్ అలీభాయ్, నీల్ జానీ అద్భుత ప్రదర్శనతో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచారు.

ఫార్ములా 4 ఇండియన్ ఓపెన్ రేసులో దక్షిణాఫ్రికాకు చెందిన అకిల్ అలీభాయ్ 26 నిమిషాల 14.474 సెకన్లతో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి ఈ సీజన్‌లో వరుసగా ఐదవ విజయాన్ని అందుకున్నాడు. మొత్తం ఆరో రేసులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని కొనసాగించాడు. భారత రేసర్ రుహాన్ అల్వా (శ్రాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్) పోల్-పొజిషన్ నుంచి రేసు మొదలుపెట్టినప్పటికీ 26 నిమిషాల 15.614 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచాడు. చెన్నై టర్బో రైడర్స్ జట్టుకు చెందిన కెనడా డ్రైవర్ హాడీ నోహ్ మిమాస్సీ 26:17.254 సెకన్లతో మూడవ స్థానాన్ని సాధించాడు.

అకిల్ అలీభాయ్ ఆనందం వ్యక్తం చేస్తూ చెప్పిన మాటలు:
“ఈ రోజు గెలిచినందుకు ఆనందంగా ఉంది. ట్రాక్ తడి ఉండటంతో కొంత జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. చివరి సమయంలో నాకు సన్నిహితంగా వచ్చినా ఆధిక్యాన్ని నిలుపుకోవడంలో విజయవంతమయ్యాను. రేపటి రేసులో కూడా ఇదే ఉత్సాహంతో విజయం సాధించాలని ఆశిస్తున్నాను.”

ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ తొలి రేసులో గోవా ఏసెస్ జేఏ రేసింగ్ జట్టు రేసర్ సోహిల్ షా 26 నిమిషాల 34.598 సెకన్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ నీల్ జానీ 26 నిమిషాల 51.754 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచి పోడియం గెలిచాడు. చెన్నై టర్బో రైడర్స్ డ్రైవర్ జోన్ లాంకాస్టర్ 26 నిమిషాల 54.848 సెకన్లతో మూడవ స్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్ రౌండ్ రెండో రేసుతో ఆదివారం పోటీలు ముగుస్తాయి.

About Author