ఐపీవో కోసం ముసాయిదా పత్రాలు సమర్పించిన లక్ష్మీ డెంటల్ లిమిటెడ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 18, 2024: డెంటల్ ఉత్పత్తుల కంపెనీ లక్ష్మీ డెంటల్ లిమిటెడ్, ఐపీవో ద్వారా నిధుల సమీకరణ కోసం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 18, 2024: డెంటల్ ఉత్పత్తుల కంపెనీ లక్ష్మీ డెంటల్ లిమిటెడ్, ఐపీవో ద్వారా నిధుల సమీకరణ కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ)ను సమర్పించింది.

ఈ ఐపీవోలో రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు తాజా జారీ చేయడం జరుగుతుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు మరియు ఇతర షేర్‌హోల్డర్లు మొత్తం 1.28 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ సందర్భంగా ఆర్బిమెడ్ ఏషియా II మారిషస్ లిమిటెడ్ కూడా తన వాటాలను విక్రయించనుంది.

అదనంగా, రూ. 30 కోట్ల వరకు ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ సాధ్యమైతే, తాజా షేర్ల జారీ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను లక్ష్మీ డెంటల్ అనుబంధ సంస్థ బిజ్‌డెంట్ డివైజెస్‌లో పెట్టుబడి పెట్టేందుకు, కొత్త మెషినరీ కొనుగోలు చేయడానికి, రుణాల చెల్లింపులు,సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.

ఇంటిగ్రేటెడ్ డెంటల్ ప్రోడక్టుల రంగంలో లీడర్‌గా ఉన్న లక్ష్మీ డెంటల్, కస్టమ్-మేడ్ క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎలైనర్ సొల్యూషన్స్, పీడియాట్రిక్ డెంటల్ ప్రోడక్టుల వంటి విస్తృత పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఈ ఐపీవోను నువామా వెల్త్ మేనేజ్‌మెంట్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా నిర్వహించనున్నాయి.

About Author