విద్యుత్ ఛార్జీల పాపం ముమ్మాటికీ జగన్ దే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్ 27,2024: జగన్ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ఆయన తుగ్లక్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్ 27,2024: జగన్ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ఆయన తుగ్లక్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు భారం పాపం ఎవరిదో తేలుద్దాం… దమ్ముంటే చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు.

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన పార్టీ ఉనికి కోసం జగన్ సరికొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. రూ.17 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పెంచిందే జగనేనని మండిపడ్డారు. ఆనాడు నువ్వు చేసిన ఒప్పందం ఫలితమే నేడు కరెంటు ఛార్జీలు పెరిగాయన్నారు.

ఎన్నికల తరవాత విద్యుత్ ఛార్జీల పెంచాలని ఈఆర్సీకి చెప్పింది నువ్వే కదా..అని జగన్ ను మంత్రి నిలదీశారు. జగన్ పాప ఫలితమే ప్రజలపై రూ.17 వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల పెంపు భారం పడిందన్నారు. కళ్లుమూసి పిల్లి పాలు తాగినట్లు… ఇపుడు కరెంట్ ఛార్జీలు పెంచారంటూ జగన్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

జగన్ అవినీతి, అసమర్థత వల్ల రాష్ట్ర ప్రజలపై, డిస్కమ్ లపై రూ.1,29,503 కోట్లు భారం పడిందన్నారు. 5 ఏళ్ల జగన్ దరిద్రపు పాలనలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి మండిపడ్డారు.

5 ఏళ్లలో మేం ఎప్పుడూ ఛార్జీలు పెంచలేదు….

ఆరుగాలం శ్రమించే రైతుల నుంచి విద్యుత్ బిల్లుల పేరుతో జగన్ దోపిడికి సిద్ధమయ్యారని మంత్రి సవిత మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగించారని, దీనిపై అప్పట్లో తాము ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే కార్యక్రమానికి అడ్డుకట్టవేశారన్నారు.

2014-19లో ఏపీని విద్యుత్ మిగులు రాష్ట్రంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని తెలిపారు. ఆ 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీ పెంచలేదని, తమ నాయకుడి సమర్థ నాయకత్వానికి నిదర్శనమని మంత్రి తెలిపారు.

జగన్ వి తుగ్లక్ డ్రామాలు

జగన్ చేసిన పాపాలు శాపాలై రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. తప్పులన్నీ చేసేసి ఏమి ఎరుగనట్లు ధర్నాలకు దిగుతున్నాడని మండిపడ్డారు. ఇటీవల రైతుల పేరుతో నిరసన తెలిపాడని, ఇపుడు విద్యుత్ ఛార్జీల పేరుతో మరో జగన్నాటకానికి తెరతీశాడని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్నా డ్రామాలు ఆడతాడో చూడాలన్నారు.

జగన్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా…. ప్రజలను ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ తుగ్లక్ డ్రామాలను ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేశాచేశారు. ఆయన గాల్లో వచ్చి…గాల్లో తిరిగారని, ఎన్నడూ రోడ్డు మీదనడవలేదని మండిపడ్డారు. ఈరోజు ధర్నాల డ్రామాకు తెరతీశాని, విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై దమ్ముంటేచర్చకు రావాలని జగన్ కు మంత్రిసవిత సవాల్ విసిరారు. 6 నెలల కాలంలో తమది మంచి ప్రభుత్వమని నిరూపితమైందన్నారు.

ఆ 11 మందికి కనిపించడం లేదు…

ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చుతోందని మంత్రి సవిత తెలిపారు. బాధ్యతలు చేపట్టగానే సీఎం చంద్రబాబునాయుడు 5 ఫైళ్లపై తొలి సంతకాలు చేశారన్నారు.

16,437 పోస్టులకు మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, ఉచిత ఇసుక, మహిళలకు మూడు సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆస్తులను కొట్టేయడానికి జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్డు రద్దుచేశామన్నారు. ఛిద్రమైన రహదారులను బాగు చేస్తున్నామన్నారు.

పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రాబోయే సంక్రాంతి నాటికి పల్లెల్లో రోడ్లన్నీ నిర్మిస్తున్నామన్నారు. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారని, అది చూసి ఓర్వలేక జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలంతా గుర్తిస్తున్నారని, వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలకు మాత్రం కనిపించడం లేదని మంత్రి సవిత మండిపడ్డారు.

About Author