షాయాజీ షిండే వృక్ష ప్రసాదం ఆలోచనకు స్వాగతం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 8,2024: మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమైన షాయాజీ షిండే ముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 8,2024: మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమైన షాయాజీ షిండే ముఖ్యమంత్రి గారితో చర్చించి, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు ప్రసాదం తోపాటు మొక్కలు ఇవ్వడంపై ఆలోచన తీసుకొచ్చిన ప్రముఖ నటులు షాయాజీ షిండే సూచనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఆలోచన అభినందనీయమని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ మరిన్ని వివరాలు తెలియజేస్తూ, షాయాజీ షిండే సూచన అమలుపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని తెలిపారు.
మంగళవారం రాత్రి, మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటులు షాయాజీ షిండే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షిండే తమ ఆలోచనలను పంచుకున్నారు.

ఈ విధంగా, వృక్ష ప్రసాద యోజనను మహారాష్ట్రలోని మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నట్లు షిండే తెలిపారు. ఈ సందర్భంగా, మొక్కల విశిష్టత గురించి మరాఠీలో రాసిన కవితను పవన్ కళ్యాణ్ కి చదివి వినిపించారు. ఆ కవితను ప్రశంసించిన పవన్ కళ్యాణ్ , ఆ కవితను తెలుగులో అనువదించి చెప్పడం విశేషమని వ్యాఖ్యానించారు.
షాయాజీ షిండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకోవడం ముఖ్యం. భవిష్యత్తుకు సుందరమైన పర్యావరణం ఇవ్వాలంటే, చిన్ననాటి నుంచే మొక్కల విశిష్టతను తెలపడం అవసరం. ఈ విషయాన్ని నేను గతంలోనే ఆలోచించాను. మహారాష్ట్రలోని సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజనను అమలు చేస్తున్నారు. మొక్కలు నాటడం నా జీవన అలవాట్లలో భాగంగా మారింది. నా తల్లి కన్నుమూసినప్పుడు ఆమె బరువు స్థాయిలో విత్తనాలను నాటాను. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో పంచుకున్నాను.
దేవాలయాలకు వెళ్లే భక్తులకు ప్రసాదంతోపాటు మొక్కలను దేవుడు ఇచ్చిన బహుమతిగా అందిస్తే, భక్తులు వాటిని నాటడం, సంరక్షించడం దైవ కార్యంగా భావిస్తారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే, అది భావి తరాలకు మేలు చేస్తుంది” అన్నారు
