శరన్నవరాత్రి సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 9,2024:శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి రాష్ట్ర ఉప

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 9,2024:శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య కొణిదెలతో కలిసి దర్శనార్థం విచ్చేశారు. మూలా నక్షత్రం సందర్భంలో సరస్వతిదేవి అలంకారంలో విరాజిల్లుతున్న అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు, వేద పండితులు ఆయన్ను సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి పవన్ కళ్యాణ్ కి తీర్థ ప్రసాదాలు అందజేశారు.