పర్యావరణ పరిరక్షణ పరిశ్రమల బాధ్యతగా మారాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 9,2024: విజయవాడలో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వర్క్ షాప్ కార్యక్రమాన్ని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 9,2024: విజయవాడలో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వర్క్ షాప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ పరిశ్రమల బాధ్యతగా మారాలని పిలుపునిచ్చారు.
‘‘పరిశ్రమలు అభివృద్ధిలో భాగం అవుతున్నప్పటికీ, భావితరాలకు ఒక పర్యావరణ సమతౌల్యం అందించడం కూడా తమ కర్తవ్యంగా గుర్తించుకోవాలి,’’ అని అన్నారు. ‘‘ప్రస్తుతం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అవసరమైంది. అలాగే పరిశ్రమలను ప్రోత్సహించడంలో వృద్ధి కీలకమవుతుంది, కానీ కాలుష్యాన్ని తగ్గించడానికి రక్షణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం కూడా అతి అవసరం’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
వారితో పాటు ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.