రాందేవ్ 25 ఏళ్ల కష్టానికి నిదర్శనమే ఈ ‘ఎక్స్ పీరియం’..పార్క్ ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,2025: చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ‘ఎక్స్‌పీరియం’ పార్కును మెగాస్టార్ చిరంజీవి చేతుల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28,2025: చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ‘ఎక్స్‌పీరియం’ పార్కును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చిరంజీవి వ్యాఖ్యలు:
“రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటికి కొత్తది కాదు. ఈ ‘ఎక్స్‌పీరియం’ పార్కుని నేను మీ అందరి కంటే ముందుగా చూశాను. 2000వ సంవత్సరంలోనే రాందేవ్ ఈ ప్రాజెక్టు గురించి నాకు చెప్పాడు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూ ఉన్నాను. మా ఇంట్లో పెరిగే అనేక రకాల మొక్కలు, చెట్లు ఆయన వద్ద నుంచి వచ్చినవే.

రాందేవ్ వ్యాపారవేత్తగా కాకుండా, ఎప్పుడూ పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచించే వ్యక్తి. ఈ 150 ఎకరాల్లో వాణిజ్య ఉద్దేశ్యంతో వాడవచ్చు, కానీ ఆయన పర్యావరణ సంరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా కొత్త జాతి మొక్కలను ఇక్కడ తెచ్చి ఈ పార్కును స్థాపించాడు.
ఇంత వృద్ధి, ప్రగతి కోసం 25 సంవత్సరాల కష్టం పెట్టిన రాందేవ్ గారు నిజంగా అద్భుతమైన కళాకారుడు.
ఈ ‘ఎక్స్‌పీరియం’ పార్కును చూసి నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయాము. ఇంత అద్భుతమైన ప్రదేశం ఒక సినిమా షూటింగ్ కోసం ఇస్తారా అని నేను రాందేవ్‌ను అడిగాను. రాందేవ్ జవాబు ఇచ్చారు, “ముందు మా సినిమాతో మొదలు పెడతాము.” కానీ ఈ ఎండలో హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం కాస్త కష్టం అని అనిపిస్తుంది.
వర్షాకాలం తర్వాత ఇక్కడ మరింత పచ్చదనం ఉంటుందని, ఆ సమయంలో షూటింగ్ చేయడం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశం వివిధ వేడుకలు, వేదికల కోసం కూడా అద్భుతంగా అనువైనది.

దేశ, విదేశాలలోని అరుదైన మొక్కలను ఒక్కచోట చేర్చిన రాందేవ్ ఈ అద్భుతమైన పార్కును నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారన్నది చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంత బిజీగా ఉన్నా, ప్రకృతి సంరక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయం.”