ఈ వారం అంతర్జాతీయ పరిణామాలే కీలకం!
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 17, 2023:అంతర్జాతీయ పరిణామాలను పక్కన పెట్టి భారత స్టాక్ మార్కెట్లు చివరి వారం పుంజుకున్నాయి.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 17, 2023:అంతర్జాతీయ పరిణామాలను పక్కన పెట్టి భారత స్టాక్ మార్కెట్లు చివరి వారం పుంజుకున్నాయి. మంగళవారం మినహాయిస్తే నాలుగు సెషన్లు లాభాల్లో ముగిశాయి.
క్రూడాయిల్ పెరుగుదల, ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వంటి అంశాలను మదుపర్లు పట్టించుకోలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1.88 శాతం ఎగిసి జీవితకాల గరిష్ఠమైన 20,220 స్థాయిని అందుకోగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 67,925ను తాకింది.

లాభాల స్వీకరణతో ఒకట్రెండు రోజులు మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి.క్రితం వారం పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఏకంగా 7.22 శాతం పెరగడం గమనార్హం. ఐటీ, బ్యాంకు, ఫార్మా, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో కొనుగోళ్ల జోష్ కనిపించింది.
నిఫ్టీ సెప్టెంబర్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 20,250 వద్ద రెసిస్టెన్స్, 20130 వద్ద సపోర్ట్ కనిపిస్తున్నాయి. ఈ వారం స్టాక్స్ కొనుగోలు చేసే ముందు ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. క్రూడాయిల్ ధరల పెరుగుదల, వివిధ లోహాల ధరల్లో హెచ్చుతగ్గులు, యూఎస్ ఫెడ్ సమావేశం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి.
ఈ వారం స్టాక్ రికమెండేషన్స్

బంధన్ బ్యాంక్: జులైలో త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి బంధన్ బ్యాంకు షేర్లు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. వాల్యూమ్ క్రమంగా పెరుగుతోంది. చివరి మూడు సెషన్లలోనే ఈ స్టాక్ 8 శాతం పెరిగింది. ఈ వారమూ మూమెంటమ్ కొనసాగొచ్చు. రూ.240 మీద పొజిషన్లు తీసుకొని రూ.270/290 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. రూ.220 వద్ద గట్టి స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
ఐసీఐసీఐ ప్రెడెన్షియల్: మే నుంచి జులై వరకు చక్కని ర్యాలీ కొనసాగించిన ఈ కౌంటర్లో నెల రోజులుగా కరెక్షన్ జరిగింది. రెండు వారాల నుంచి మళ్లీ మూమెంటమ్ మొదలైంది. రూ.595 వద్ద ముగిసిన ఈ షేరును రూ.660/700 వరకు టార్గెట్ పెట్టుకొని కొనుగోలు చేయొచ్చు. రూ.555 వద్ద కచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి.
ముత్తూట్ ఫైనాన్స్: కొన్ని నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ముత్తూట్‌లో రూ.1300 మీద పొజిషన్ తీసుకోవాలి. రూ.1275ను గట్టి స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.1390/1460 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. మూడు వారాలుగా ఈ కౌంటర్లో అక్యూములేషన్ కనిపిస్తోంది. ఈ వారం చురుగ్గా ట్రేడయ్యే అవకాశం ఉంది.

ఐచర్ మోటార్స్: చివరి వారం ఐదు సెషన్లలో ఈ షేర్ల డెలివరీ వాల్యూమ్ పెరుగుతోంది. జులై 10% పతనమయ్యాక రూ.3350-3400 రేంజులో బేస్ ఏర్పాటు చేసుకుంది. రూ.3425 వద్ద ముగిసిన ఈ షేర్లను రూ.3420 మీదే కొనుగోలు చేసి రూ.3580/3650 టార్గెట్‌గా పెట్టుకోవాలి. రూ.3370ను ట్రేడర్లు స్టాప్‌లాస్‌గా పరిగణించాలి.
యూపీఎల్: చివరి త్రైమాసికం ఫలితాలు ప్రకటించాక ఈ కౌంటర్లో మూమెంటమ్ పెరిగింది. షేర్లు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. చివరి మూడు సెషన్లలో బాగా పెరిగాయి. రూ.634 వద్ద ముగిసిన యూపీఎల్ కౌంర్లో రూ.620 మీద పొజిషన్ తీసుకోవాలి. రూ.600ను స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.675/710 వరకు టార్గెట్ చేయొచ్చు.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709