సంగీత విద్వాన్ ఆకెళ్ల జయంతి ఉత్సవం

అత్యంత ఘనంగా శ్రీ గురు రాజా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ 11వ వార్షికోత్సవం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం, జూన్ 15,2025 : శ్రీ గురు రాజా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ తన 11వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. సంగీత విద్వాన్ ఆకెళ్ల మల్లిఖార్జునశర్మ గారి 87వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు విశాఖపట్నంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా పలు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి..
ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు విజినగిరి సంతోష్ కుమార్ గారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ సంగీత ప్రతిభను ప్రదర్శించారు. ఆటలు, గీతాలు, కీర్తనలు ఆలపిస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.
ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన ఆకెళ్ల నరసింహస్వామి గారు, ఆయన మనవడు నిరంజన్‌గారు లను ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం, ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు శ్రీ సంతోష్ కుమార్ తో పాటు సభ్యులు, శ్రీ మధుసూదనా రావు తదితరులు పాల్గొన్నారు. సంగీత విద్యాభివృద్ధికి శ్రీ గురు రాజా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.





