దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించిన మహానేత… మన్మోహన్ సింగ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,2024: భారత దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇకలేరనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి ఆత్మకు శాంతి కలగాలని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,2024: భారత దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇకలేరనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భారత ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా, ఆర్థిక మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించారు.

ఆయన హయాంలో ఆర్థిక సంస్కరణలు దేశాన్ని కొత్త దిశగా నడిపించాయి. ఆర్థికంగా సమృద్ధి చెందేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. మన్మోహన్ సింగ్ అందించిన సేవలు ఈ దేశానికి అమూల్యమైనవని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను.

మన్మోహన్ సింగ్ కుటుంబానికి నా గుండెపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

About Author