కాకినాడలో సంక్రాంతి సంబరాలకు విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి అతిథులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 26,2024: జీ తెలుగు తన వినోద కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించి, రెండు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 26,2024: జీ తెలుగు తన వినోద కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించి, రెండు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుల్లితెర అభిమానులను పలకరిస్తోంది. ఈ ఏడాది వరుస ఈవెంట్లతో ప్రేక్షకులను అలరించిన జీ తెలుగు, 2025 సంవత్సరాన్ని ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది.

తెలుగు వారి పెద్ద పండగైన సంక్రాంతిని మరింత ఆనందంగా జరపడానికి “సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం” అనే స్పెషల్ ఈవెంట్‌ను కాకినాడలో నిర్వహించనుంది.

హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సంబరాలను మరింత ప్రత్యేకంగా చేసేలా ఉంటారు. “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ టీమ్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేయనుంది.

ఈ ఉత్సవం డిసెంబర్ 28 శనివారంమధ్యాహ్నం 3 గంటలకు, కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల (P.R Government College) గ్రౌండ్ వేదికగా జరగనుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా, జీ తెలుగు సీరియల్స్ నటీనటులు కూడా పాల్గొంటారు.

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, రాజేంద్రప్రసాద్, ఆమని, శ్రీలక్ష్మి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ అభిమానులను అలరించనున్నారు.

ఇక, జీ తెలుగు వారి సంక్రాంతి సంబరాల భాగంగా, మీరు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని, మీ అభిమాన తారలను నేరుగా చూసే అవకాశం పొందండి.

About Author