ఆధునిక వాస్కులర్ సర్జరీ: అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది..?

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 2,2025 : వాస్కులర్ సర్జరీ రంగంలో గత 20 సంవత్సరాలుగా ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జికల్ విధానాలలో గణనీయమైన పురోగతి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 2,2025 : వాస్కులర్ సర్జరీ రంగంలో గత 20 సంవత్సరాలుగా ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జికల్ విధానాలలో గణనీయమైన పురోగతి సాధించామని యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ (హైటెక్ సిటీ)కి చెందిన సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జన్, ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు తెలిపారు. ఈ పురోగతులు వాస్కులర్ వ్యాధుల చికిత్సలో ప్రమాణాలను పెంచి, రోగుల ఫలితాలను బాగా మెరుగుపరిచాయని ఆయన అన్నారు.

ఎండోవాస్కులర్ పద్ధతుల పురోగతి..

ఎండోవాస్కులర్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీలకు ప్రత్యామ్నాయంగా కనిష్ట కోతతో చేసే ఒక ఆధునిక పద్ధతి. ఈ పద్ధతిలో తొడ లేదా రేడియల్ ధమనులలో చిన్న కోతల ద్వారా కాథెటర్లు, బెలూన్‌లు, స్టెంట్లను ఉపయోగిస్తారు. అనూరిజమ్స్, ఆక్లూజివ్ డిసీజ్ వంటి సంక్లిష్ట సమస్యలకు ఈ చికిత్సలు చాలా ఉపయోగపడుతున్నాయి.

ప్రయోజనాలు..

శస్త్రచికిత్స గాయం తగ్గడం

ఆసుపత్రిలో తక్కువ సమయం ఉండటం

ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గడం

రోగి త్వరగా కోలుకోవడం

డాక్టర్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, ఇంతకుముందు అబ్డామినల్ అయోర్టిక్ అనూరిజం కోసం ఓపెన్ సర్జరీ చేయించుకున్న రోగి వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎండోవాస్కులర్ విధానంలో 24 నుండి 48 గంటల్లోపే డిశ్చార్జ్ అవుతున్నారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఓపెన్ సర్జరీ చేయించుకోలేని వారికి కూడా ఈ పద్ధతి చాలా సురక్షితమని ఆయన వివరించారు.

ఓపెన్ సర్జరీల పరిణామం..

ఎండోవాస్కులర్ సర్జరీ ప్రాచుర్యం పొందినప్పటికీ, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఓపెన్ వాస్కులర్ చికిత్సలు ఇప్పటికీ అవసరమవుతాయి. మెరుగైన వాస్కులర్ గ్రాఫ్ట్ మెటీరియల్స్ మరియు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఓపెన్ సర్జరీలు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయి. ఓపెన్, ఎండోవాస్కులర్ పద్ధతులను కలిపి చేసే ‘హైబ్రిడ్ విధానాలు’ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఇవి రోగికి మెరుగైన ఫలితాలను అందిస్తాయి.

సర్జన్ పాత్ర..

ఈ ఆధునిక యుగంలో, వాస్కులర్ సర్జన్‌లకు ఓపెన్ , ఎండోవాస్కులర్ విధానాలు రెండింటిపై పూర్తి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో బయో ఇంజనీర్డ్ గ్రాఫ్ట్‌లు,రోబోటిక్-సహాయక చికిత్సలు మరింత ఖచ్చితమైన చికిత్సను అందించనున్నాయని డాక్టర్ శ్రీకాంత్ రాజు పేర్కొన్నారు.

అపాయింట్‌మెంట్ వివరాలు..

డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జన్ మరియు ఫుట్ కేర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ (హైటెక్ సిటీ) వారు సెప్టెంబర్ 5, 2025న రాజమండ్రి మరియు కాకినాడలో అందుబాటులో ఉంటారు.

రాజమండ్రిలోని యశోద హాస్పిటల్స్ మెడికల్ సెంటర్లో: ఉదయం 10:00 – 1:00 pm వరకు, కాకినాడలో: మధ్యాహ్నం 2:00 – 6:00 pm వరకు.. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి దయచేసి 7353922600 నంబర్‌కు కాల్ చేయండి లేదా ఆన్‌లైన్‌లో https://www.yashodahospitals.com/ ద్వారా బుక్ చేసుకోండి.

About Author