సెన్సేష‌న‌ల్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ‘ఎం4ఎం’ చిత్రం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్ 30,2024 : మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా నటించిన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్ 30,2024 : మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఎంఫోర్ఎం’ (M4M – Motive For Murder) విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా, డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల సినిమా ముఖ్యాంశాలను పంచుకున్నారు. “ప్రపంచ వ్యాప్తంగా అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందించాం. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇప్పటివరకు తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేస్తున్నాం,” అని పేర్కొన్నారు. అలాగే, “ఈ సినిమా రాబోయే పది సంవత్సరాల పాటు చర్చలో ఉండే అంశంగా నిలుస్తుందని విశ్వాసం ఉందని” ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా, “ఇటీవ‌ల ‘ఎంఫోర్ఎం’ సినిమా హిందీ ట్రైలర్ గోవా ఫిలిం ఫెస్టివల్‌లో, IMPPA (Indian Motion Pictures Producers Association) ఆధ్వర్యంలో విడుదల చేయడంపై మంచి స్పందన వచ్చింది. అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను అద్భుతమైన టీంతో Hollywood స్టాండర్డ్స్‌లో తీర్చిదిద్దాం,” అని డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల పేర్కొన్నారు. “హీరోయిన్ జో శర్మ తన ఫ‌ర్మార్మెన్స్‌తో సినిమా హైలైట్‌గా నిలిచింది,” అన్నారు.

అందుకోసం, “ఫ‌స్ట్ డే ప్రేక్షకులు ఈ సినిమా చూసి కిల్ల‌ర్ ఎవ‌రో అంచనా వేయగలిగితే ₹1 లక్ష బహుమతిగా ఇస్తాం,” అని ఆస‌క్తిక‌రంగా ఒక కాంపిటీష‌న్‌ను డైరెక్ట‌ర్ ప్రకటించారు.

హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ, “మొద‌టిగా, నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మోహన్ వడ్లపట్ల గారికి పెద్ద థ్యాంక్స్. ఆయన నాకు గాడ్‌ఫాద‌ర్. ఈ సినిమా కోసం ఈ ఏడాది ఆరు సార్లు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాను. ఇందులో నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్‌గా నటించాను. ఈ సినిమా అనుభవం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది, చివరివరకు ప్రేక్షకులు ఉత్కంఠతో ఉండిపోతారు. నా నమ్మకంతో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందని చెప్పగలను,” అన్నారు.

గోవాలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన వేడుకలో, జో శర్మ (USA) తళుక్కుమంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “సీరియల్ కిల్లర్ కాన్సెప్టు చాలా కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది,” అని ఆమె అన్నారు. “ఈ కాన్సెప్ట్ 110 ఏళ్ల సినీ చరిత్రలో మొదటిసారిగా వచ్చింది, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం గర్వంగా ఉంది,” అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.

‘M4M’ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో విడుదల కానుంది.

బ్యానర్: మోహన్ మీడియా క్రియేషన్స్, McWin Group USAతో కలిసి
తారాగణం:

హీరోయిన్: జో శర్మ (USA)
హీరో: సంబీత్ ఆచార్య
మరో నటులు: శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, MRC వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్
సాంకేతిక సిబ్బంది:

కథ: మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల, జో శర్మ
స్క్రీన్‌ప్లే: మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల
దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల
డైలాగ్స్: శ్రీచక్ర మల్లికార్జున
సంగీతం: వసంత్ ఇసాయిపెట్టై
DOP: సంతోష్ షానమోని
స్టంట్స్: యాక్షన్ మల్లి
ఎడిటింగ్: పవన్ ఆనంద్
మిక్సింగ్: విష్ణు వర్ధన్ కాగిత, కార్తికేయ స్టూడియో
DI: రత్నాకర్ రెడ్డి, కలర్ లాజిక్స్
VFX/CG: కొత్తపల్లి ఆది, వెంకట్
సౌండ్ డిజైనర్: సాగర్
దర్శకత్వ శాఖ: రాహుల్ అడబాల, శ్రీచక్ర మల్లికార్జున, హరి కిషన్, సుభాష్ సిరిపెల్లి, గోవింద్, రాజు, వెంకట్, వంశీ
పీఆరోఓలు : పర్వతనేని రాంబాబు, కడలి రాంబాబు, దయ్యాల అశోక్

About Author