ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ పెన్షన్ – భారత్ వృద్ధి గాధను ఆసరాగా చేసుకుని రిటైర్మెంట్ కోసం పొదుపు

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఆగస్టు 29,2024: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇటీవల ‘ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ పెన్షన్’

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఆగస్టు 29,2024: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇటీవల ‘ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ పెన్షన్’ పేరిట మార్కెట్ ఆధారిత పెన్షన్ ప్రోడక్ట్‌ను ఆవిష్కరించింది.

ఈ ప్రోడక్ట్, వ్యయపరంగా , పన్నులపరంగా సమర్థవంతమైన రిటైర్మెంట్ ప్రణాళికను రూపొందించుకోవడానికి కస్టమర్లకు సహాయపడేలా రూపొందించింది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు రిటైర్మెంట్ ప్రణాళిక అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన అంశం.

ఈ కొత్త ప్రోడక్ట్‌తో, కస్టమర్లు భారత వృద్ధి గాధలో భాగమై, తమ రిటైర్మెంట్ అవసరాల కోసం నిధిని సమకూర్చుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ 100% ఈక్విటీలో పెట్టుబడులకు అవకాశం కల్పించడమే కాకుండా, గరిష్ట రాబడులు పొందేందుకు ఈక్విటీ, డెట్,బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మధ్య అపరిమిత ఉచిత మార్పు ఫీచర్‌ను కూడా అందిస్తుంది. అలాగే, ఈ ప్రోడక్ట్‌లో భాగంగా, ఐసీఐసీఐ ప్రూ పెన్షన్ ఇండియా గ్రోత్ ఫండ్ ,ఐసీఐసీఐ ప్రూ పెన్షన్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లను అందిస్తున్నారు.

ఆదాయం ప్రారంభ తేదీని ముందుకు జరపడం లేదా వాయిదా వేసుకోవడం వంటి ఫీచర్లు, త్వరగా రిటైర్ కావాలనుకునే FIRE (Financial Independence Retire Early) తరానికి సహాయపడతాయి. రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్ని ప్రారంభించాలని కోరుకునే వారు ఆదాయ ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవచ్చు.

ప్రధానంగా, పాలసీ ముగిసిన తర్వాత కస్టమర్లు తమ సంచిత నిధి నుంచి 60% మొత్తాన్ని పన్నురహితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని జీవితకాలం పాటు కచ్చితమైన ఆదాయం కోసం యాన్యుటీగా ఉపయోగించవచ్చు.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ శ్రీ అమిత్ పల్టా మాట్లాడుతూ, “కస్టమర్లు తమ రిటైర్మెంట్ ప్రణాళికలను అవాంఛనీయ పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి ‘వెయివర్ ఆఫ్ ప్రీమియం’ అదనపు బెనిఫిట్‌ను పొందవచ్చు.

అవసరాల రీత్యా డబ్బు విత్‌డ్రా చేసుకోవడంలో పాక్షిక విత్‌డ్రాయల్ ఫీచర్ కూడా సహాయపడుతుంది. అదనపు పెట్టుబడుల ద్వారా తమ రిటైర్మెంట్ సేవింగ్స్‌ను పెంచుకోవడానికి టాప్-అప్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది,” అన్నారు.

“మా కస్టమర్లకు హామీ ఇచ్చిన ప్రతి అంశంలో నిబద్ధతతో ఉన్నాము. 2024 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలోనే అత్యుత్తమమైన 99.17% క్లెయిమ్ సెటిల్మెంట్ రేటుతో పాటు, రిటైల్ డెత్ క్లెయిమ్స్ విషయంలో 1.27 రోజుల్లోనే పరిష్కారాన్ని అందించడం మా కస్టమర్లపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం,” అని ఆయన వివరించారు.

About Author