అంబరాన్ని అంటిన బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2026 వార్షికోత్సవ వేడుకలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి10, 2026: విద్యార్థుల ప్రతిభకు పాఠశాలలే పునాదులని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పలువురు ప్రముఖులు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి10, 2026: విద్యార్థుల ప్రతిభకు పాఠశాలలే పునాదులని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. బోడుప్పల్‌లోని కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం (జనవరి 9) సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో కన్నులపండువగా జరిగాయి.
ఘనంగా అతిథుల రాక:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సి.ఎస్.ఐ.ఆర్ – ఐ.ఐ.సి.టి (CSIR – IICT) హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి విచ్చేశారు. ప్రత్యేక అతిథిగా ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, టాలీవుడ్ నటి ఆశ్రిత వేముగంటి నండూరి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు:

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఆలపించిన భగవద్గీత శ్లోకాలు సభికులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తాయి. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు, సామాజిక అంశాలపై వేసిన నాటకాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని, ఇటువంటి వేదికలు వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తాయని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులకు పురస్కారాలు:
పాఠశాల ప్రస్థానంలో భాగస్వాములైన వారిని యాజమాన్యం ఘనంగా గౌరవించింది. విద్యాలయంలో పదేళ్లు, ఐదేళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు వారి అంకితభావానికి గుర్తుగా ప్రత్యేక పురస్కారాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ కేవల్ చంద్, శ్రీమతి కిరణ్, నిర్వాహకులు రితేష్, రూపేష్, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కస్తూరి రెడ్డి, హెచ్.ఎం. శ్రీమతి తనుశ్రీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.