ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి ప్రాధాన్యత ఎవరికంటే..?

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 18,2024 : ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యత పేదలకు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 18,2024 : ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యత పేదలకు ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలను అందించాక, పేదలు స్వయంగా తమ గృహాలను నిర్మించుకోవచ్చని ఆయన వివరించారు. అవసరమైన నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్లు అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

మౌళిక వసతులు లేకుండా నిరుపయోగంగా ఉన్న వేలాది ఇళ్లకు అవసరమైన నిధులు కూడా అందజేసామని చెప్పారు. గతంలో పేదల కోసం 20-30 అంతస్తుల భవనాలు నిర్మించలేమని, ఇకపై పరిమిత స్థాయిలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

About Author