యాపిల్ ప్రధాన వ్యాపారం గురించి మీకు తెలుసా..?
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, డిసెంబర్ 25, 2024: యాపిల్ అనేది అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి సాంకేతిక సంస్థ. 1976 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన ఈ సంస్థను స్టీవ్ జాబ్స్ స్థాపించారు.
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, డిసెంబర్ 25, 2024: యాపిల్ అనేది అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి సాంకేతిక సంస్థ. 1976 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన ఈ సంస్థను స్టీవ్ జాబ్స్ స్థాపించారు. 2011లో ఆయన మరణించినప్పటికీ, యాపిల్ కంపెనీ సాంకేతిక రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది.
వినియోగదారు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ సేవల అభివృద్ధి, విక్రయాల్లో యాపిల్ ప్రాధాన్యతను చాటుకుంటోంది. యాపిల్ ప్రసిద్ధ ప్రోడక్ట్స్: iPhone, iPad, Macintosh కంప్యూటర్, Apple వాచ్, Apple TV. ప్రస్తుతం యాపిల్‌లో సుమారు 1,64,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
యాపిల్ ఆదాయం..
2023-24 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ దాదాపు 391 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33 లక్షల కోట్లు) ఆదాయం పొందింది. ఈ ఆదాయంలో 44 శాతం అమెరికా నుండి, 26 శాతం యూరోపియన్ దేశాల నుండి వచ్చింది. చైనా నుండి 17 శాతం ఆదాయం లభించగా, భారత్ సహకారం 2 శాతం మాత్రమే ఉంది.