సెబీకి తాజా ఐపీవో పత్రాలు సమర్పించిన కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగస్టు 28,2024:ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా నిధులు సమీకరించేందుకు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగస్టు 28,2024:ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్, తాజాగా సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించింది. మంగళవారం దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ప్రతిపాదిత ఐపీవో కింద తాజాగా రూ. 192.3 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు మరియు ఒక ఇన్వెస్టరు 51.94 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.

ప్రమోటర్లయిన ప్రయాస్ గోయల్, ప్రేరక్ గోయల్, ప్రమోటర్ గ్రూప్‌ అయిన నమ్రతా గోయల్, నిధి గోయల్, పుష్ప గోయల్ మరియు ఇన్వెస్టరు అయిన ఏఎఫ్ హోల్డింగ్స్ , ఓఎఫ్ఎస్ కింద షేర్లను విక్రయిస్తున్నారు.

తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 25 కోట్ల మొత్తం వాటర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్స్‌ కోసం కొత్త అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కాంకర్డ్ ఎన్విరో ఎఫ్‌జెడ్‌ఈలో ఇన్వెస్ట్ చేయబడుతుంది. అలాగే  తయారీ ప్లాంట్లు, సంబంధిత కార్యకలాపాల విస్తరణ కోసం రూ. 10.505 కోట్ల నిధులు రోషెమ్ సెపరేషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (Rochem Separation Systems (India) Private Ltd)లో ఇన్వెస్ట్ చేయబడతాయి.

రుణాల చెల్లింపు కోసం రూ. 50 కోట్ల నిధులు CEFలో ఇన్వెస్ట్ చేయబడతాయి. కొత్త మార్కెట్లలో యాక్సెస్ పొందేందుకు టెక్నాలజీ మరియు వృద్ధి కార్యకలాపాల కోసం రూ. 33.5 కోట్లు కేటాయించబడతాయి. CEF వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 20 కోట్లు, “పే పర్ యూజ్/పే యాజ్ యూ ట్రీట్” వ్యాపార విస్తరణ కోసం రోజెర్వో ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్ (Roserve Enviro Private Limited)కి రూ. 10 కోట్లు కేటాయించబడతాయి. అలాగే, ప్లాంటు మరియు మెషినరీపై మూలధన వ్యయ అవసరాల కోసం రూ. 3.228 కోట్లు వినియోగించబడతాయి. కొంత మొత్తం సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోబడుతుంది.

పారిశ్రామిక వ్యర్ధ నీరు పునర్వినియోగం, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సొల్యూషన్స్ మొదలైన వాటికి సంబంధించి కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ సమీకృత సొల్యూషన్స్‌ను అందిస్తోంది.

2024 మార్చి 31 నాటికి ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాలోని దేశాలకు కంపెనీ ఎగుమతులు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 377 కస్టమర్లకు కంపెనీ సేవలు అందిస్తోంది.

పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కంపెనీకి ఇది రెండో ప్రయత్నం. 2022లో సెబీకి కంపెనీ ముసాయిదా ఐపీవో పత్రాలను సమర్పించింది. పబ్లిక్ ఇష్యూని చేపట్టేందుకు అనుమతి కూడా పొందింది. కానీ, అప్పట్లో పబ్లిక్ ఇష్యూని చేపట్టలేదు.

మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, ఈక్విరస్ క్యాపిటల్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

About Author