“నాణ్యత,విశ్వాసానికి ప్రతీకగా బిల్డింగ్ బ్లాక్ గ్రూప్”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 14, 2024: “నాణ్యత ,విశ్వాసానికి బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ప్రతీక” అని సినీ నటి ఐశ్వర్య మీనన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 14, 2024: “నాణ్యత ,విశ్వాసానికి బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ప్రతీక” అని సినీ నటి ఐశ్వర్య మీనన్ అన్నారు. ఆమె హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్ఐసీసీలో జరిగిన 474వ గ్రాండ్ టాలెంట్ అవార్డుల వేడుకలో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ, “ఈ గ్రూప్ ఇళ్ల నిర్మాణానికి మాత్రమే కాకుండా, భవిష్యత్తు నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోంది” అని చెప్పారు. అలాగే, బీబీజీ బృందం అంకితభావం ,మహిళా సాధికారత పట్ల చూపిస్తున్న శ్రద్ధను ఆమె ప్రశంసించారు.

బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, “బీబీజీ బంగారు తల్లి లక్ష్యం మహిళలను ఉన్నత స్థానంలో చూడటం” అని తెలిపారు. 2040 నాటికి 20 లక్షల మంది మహిళలకు సాధికారత కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఇక 240 ప్రాజెక్టులు పూర్తి చేసిన బీబీజీ, 1,25,000 మంది కస్టమర్ల కళ్లలో ఆనందాన్ని చూసినట్లు ఆయన చెప్పారు. 2040 నాటికి మరో 10 లక్షల మంది భారతీయులు సొంత ప్లాట్లను పొందేందుకు ప్రణాళికలు ఉన్నాయని వివరించారు.

“అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు బీబీజీ కట్టుబడి ఉంది” అని ఆయన చెప్పారు. “మేము ప్రజల కంటున్న కలలు, నమ్మకాలకు ఆసరాగా నిలుస్తున్నాం” అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సినీ నటి ఐశ్వర్య మీనన్ అవార్డులను అందజేశారు. ఈ వేడుకలో లక్కీ డీప్ ద్వారా బహుమతులు ప్రదానం చేయబడ్డాయి.

About Author