శ్రేయ మ్యూజిక్ ఆధ్వర్యంలో రెండు భక్తి గీతాల విడుదల..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 14, 2024: నవరాత్రి సందర్భంగా శ్రేయ మ్యూజిక్,ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో రెండు భక్తి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 14, 2024: నవరాత్రి సందర్భంగా శ్రేయ మ్యూజిక్,ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో రెండు భక్తి గీతాలు విడుదలయ్యాయి. అవి ‘మైయా కా గుంగాన్ కరో’,’తేరే దార్ కా పూజారి జగదాంబే’. ఈ భక్తి గీతాలతో పాటు ఉద్యోగులు,వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రారంభించారు.

మైయా కా గుంగాన్ కరో ఈ గీతాన్ని గోలూ డీ ఆలపించగా, ముకేష్ రాజ్ లిరిక్స్ రాశారు. హిమాంశు కుమార్ దీపక్ సంగీతాన్ని అందించారు. పంచీ జలోన్‌వి ఈ పాటకు దర్శకత్వం వహించారు.

తేరే దర్ కా పూజారి జగదాంబే ఈ గీతాన్ని సుర్భీ సింగ్ ఆలపించారు. ఈ పాటకు హిమాంశు కుమార్ దీపక్ లిరిక్స్,సంగీతం అందించారు. పంచీ జలోన్‌వి ఈ పాటకు కూడా దర్శకత్వం వహించారు.

ఈ రెండు భక్తి గీతాలను సంగీత రాయ్ నిర్మాతగా, శ్రేయ రాయ్ సహ నిర్మాతగా విడుదల చేయగా, డీ తాత్యా,పీ మహేశ్వర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రేయ మ్యూజిక్ క్రియేటివ్ హెడ్ హేమంత్ కుమార్ రాయ్ మాట్లాడుతూ, ఈ భక్తి గీతాల విడుదల భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు.

ఆరోగ్య బీమా పథకం ప్రారంభం ఈ భక్తి గీతాల విడుదలతో పాటుగా, ఉద్యోగులు ,వినియోగదారుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం కూడా ప్రవేశపెట్టారు. ‘శ్రేయ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్’ పేరుతో ఈ పథకం కింద శ్రేయ గ్రూప్ ఉద్యోగులకు రూ. మూడు లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందిస్తారు. లీడర్స్‌కి రూ. రెండు లక్షల నుంచి రూ. పది లక్షల వరకు కవరేజీ లభిస్తుంది. శ్రేయ వినియోగదారులు రూ. రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షల మధ్య బీమా కవరేజీ పొందుతారు.

సామాజిక కర్తవ్యబద్ధత ఇదే కార్యక్రమంలో శ్రేయ గ్రూప్ లక్నోలోని టెలిబాగ్‌లో కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సంస్థ సామాజిక, వ్యాపార కర్తవ్యాలకు ఈ కార్యాలయం నిదర్శనమని తెలిపారు.

About Author