క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ “కటాలన్” టీజర్ రిలీజ్, మే 14న గ్లోబల్ రిలీజ్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 17,2026: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కటాలన్’ టీజర్ రిలీజ్ అయ్యింది.
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జనవరి 17,2026: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కటాలన్’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందనను కొనసాగిస్తూ, సెకండ్ లుక్ పోస్టర్ మరింత ఆసక్తికరంగా రూపొందించనుంది. ఏనుగుల వేట నుంచి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్ సన్నివేశాలను ఈ పోస్టర్ సూచిస్తోంది.
సినిమా హీరో ఆంటోనీ వర్గీస్, ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు అభిమానుల ప్రశంసల దొరుకుతున్నాడు. ఈ చిత్రం మలయాళ సినిమా చరిత్రలో అత్యంత పెద్ద విడుదలగా మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపొందింది.
Read this also:Asmita Yogasana South Zone League 2025-26 Kicks Off at Delhi Public School..
Read this also:Canon India Unveils Tungsten TotalAgility to Drive AI-Powered Enterprise Automation
యాక్షన్ సన్నివేశాలు థాయ్‌లాండ్‌లో చిత్రీకరించబడ్డాయి. అంతర్జాతీయ యాక్షన్ సినిమాలకు ప్రఖ్యాతి గల కేచా ఖంఫక్డీ దర్శకత్వంలో, ఓంగ్-బాక్ స్టైల్ యాక్షన్ సన్నివేశాలు సినిమా లో ఉన్నాయి. ఏనుగు సన్నివేశాలతో సినిమా మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
సినిమా సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ సమకూర్చారు. కథానాయికగా దుషారా విజయన్ నటిస్తూ, తెలుగు నటుడు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి, మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, హనాన్ షా ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్ రచించారు.
ఇదీ చదవండి : సినిమా రివ్యూ:స:కుటుంబానాం..కొత్త ఏడాదిలో కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్ మూవీ..!
Read this also:Future of Work: Saba Adil’s 2026 Workplace Blueprint..
ఈ పాన్-ఇండియన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ప్రేక్షకులను థ్రిల్లర్, యాక్షన్, మాస్ దృశ్యాలతో ఆకట్టుకునేలా ‘కటాలన్’ భారీ ప్రాజెక్ట్‌గా రూపొందిస్తోంది.