రూ.300 కోట్ల అంచనా ఆదాయంతో వుడ్స్ ఫేజ్-II ఆరంభం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 3, 2025:పర్యావరణ-స్నేహపూరిత జీవనశైలిని ప్రోత్సహిస్తూ సమగ్ర బయోఫిలిక్ రియల్ ఎస్టేట్ రంగంలో ముందున్న

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 3, 2025:పర్యావరణ-స్నేహపూరిత జీవనశైలిని ప్రోత్సహిస్తూ సమగ్ర బయోఫిలిక్ రియల్ ఎస్టేట్ రంగంలో ముందున్న స్టోన్క్రాఫ్ట్ గ్రూప్, వుడ్స్ షంషాబాద్ ఫేజ్-IIను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి అడవిగా పేరు గాంచిన ఫేజ్-Iకు విస్తరణగా ఈ ప్రాజెక్టు రూపొందించింది.
తొలి దశలో 18 ఎకరాల్లో 4.5 లక్షల చెట్లు నాటగా, ఇప్పుడు రెండో దశలో మరో 25 ఎకరాల్లో 2 లక్షల చెట్లు నాటే పనులు చేపట్టనున్నారు. మొత్తం మియావాకి అరణ్య విస్తీర్ణం 6.5 లక్షల చెట్లతో విస్తరించనుంది.
Read This also…IndiGo and Garuda Indonesia Forge Codeshare Partnership to Boost Connectivity Between India and Indonesia
ఈ దశలో మొత్తం 100+ ఎకరాల్లో 150 ఫామ్ యూనిట్లు రూపొందించబడ్డాయి. ఒక్కొక్క యూనిట్ 1,800 నుంచి 3,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా, మొత్తం 3,30,300 చదరపు గజాల స్థలాన్ని విక్రయానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

సౌకర్యాల్లో వైవిధ్యం
వుడ్స్ షంషాబాద్ ఫేజ్-IIలో ఉచిత నీటి సరఫరా, సుళువైన వృథ్ జలాల నిర్వహణ, పూర్తిస్థాయి పవర్ బ్యాకప్, క్లబ్ హౌస్, 24/7 భద్రతా గేట్ కమ్యూనిటీ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ప్రకృతికి దగ్గరగా – జీవితానికి ఆరోగ్యం
స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎండీ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ – “మియావాకి అడవుల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, నివాసితులకు ఆరోగ్యకరమైన జీవనవాతావరణాన్ని అందించడమే మా లక్ష్యం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫేజ్-II ప్రారంభం, ప్రకృతి భాగమైన జీవనశైలికి ప్రతీకగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
పర్యావరణ దృక్కోణంతో అభివృద్ధి
గత మూడు దశాబ్దాలకు పైగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్న స్టోన్క్రాఫ్ట్ గ్రూప్, ఇప్పటికే PGA గోల్ఫ్ సిటీ, వుడ్స్ ఇంద్రేశం, అసిస్టెడ్ లివింగ్ వంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. అంతేగాక, AQI మానిటరింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసి తమ పర్యావరణ బాధ్యతను మరింత బలపరిచింది.