వార్ 2 టీజర్: ఎన్టీఆర్‌కు నరకానికి స్వాగతం – కబీర్ ఘాటు హెచ్చరిక!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 22, 2025: యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 టీజర్ ఇవాళ అధికారికంగా విడుదలైంది. 1 నిమిషం 34 సెకన్ల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 22, 2025: యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 టీజర్ ఇవాళ అధికారికంగా విడుదలైంది. 1 నిమిషం 34 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన X (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ, జూనియర్ ఎన్టీఆర్‌ను వార్ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించారు.

హృతిక్ తన ‘కబీర్’ పాత్రతో ఎన్టీఆర్‌కు గట్టి హెచ్చరికతో స్వాగతం పలికారు. “ఇలా ప్రారంభమవుతుంది ఎన్టీఆర్… సిద్ధంగా ఉండండి… ఇక్కడ దయకు చోటు లేదు… నరకానికి స్వాగతం. ప్రేమతో – కబీర్” అంటూ ఇంటెన్స్ డైలాగ్‌తో టీజర్‌ను షేర్ చేశారు.

ఇది కూడా చదవండి…తలసీమియా బాధితుల కోసం కామినేని ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు

2019లో విడుదలైన వార్ చిత్రం యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో మూడవ చిత్రంగా వచ్చి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సీక్వెల్‌గా వస్తున్న వార్ 2లో హృతిక్ రోషన్ మరోసారి కబీర్ పాత్రలో మెరవనుండగా, జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ప్రతినాయకుడిగా అద్భుత పాత్రలో కనిపించనున్నారు.

టీజర్‌లో హృతిక్ పవర్ఫుల్ యాక్షన్ మూడ్‌లో, కత్తితో చలనాలు, భారీ మసిల్ షో, అద్భుతమైన స్టంట్స్, కార్ చేజింగ్ లు, విజువల్ గ్రాండియర్‌తో ఫుల్ యాక్షన్ మాస్ మసాలా చూపిస్తూ ప్రేక్షకుల ఉత్కంఠను పెంచారు. 2023లో విడుదలైన టైగర్ 3 చిత్రంలో ‘వార్ 2’ని ఎండ్-క్రెడిట్ సన్నివేశంలో ప్రకటించిన యశ్ రాజ్, ఇప్పుడు ఫుల్ ఫోర్స్‌లో ప్రచారం మొదలుపెట్టింది.

భారీ కాంబినేషన్… భారీ అంచనాలు

ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కియారా అద్వానీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, ఇది హృతిక్‌తో అతని మొదటి సినిమా కావడం విశేషం. బాలీవుడ్‌లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న హృతిక్, ఈ సినిమాతో మరోసారి తన యాక్షన్ మార్క్‌ను ప్రూవ్ చేయనున్నాడు.

Read This also…Free Medical Services for Thalassemia Patients at Kamineni Hospitals

వార్ 2 ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14, 2025న థియేటర్లలో విడుదల కాబోతుంది. కబీర్ vs ఎన్టీఆర్ మధ్య ఘోరమైన యుద్ధానికి రంగం సిద్ధమవుతుండటంతో… స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం ఫ్యాన్స్ తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.

About Author