తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కో-చైర్‌పర్సన్‌గా ఉపాసన కామినేని కొణిదెల నియామకం..

వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 5,2025: తెలంగాణ క్రీడా రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ

వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 5,2025: తెలంగాణ క్రీడా రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025లో భాగంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు’కు కో-చైర్‌పర్సన్‌గా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల నియమితులయ్యారు.

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టికి అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులను వెలికి తీసి, వారికి మెరుగైన శిక్షణ అందించడానికి ఈ నియామకం దోహదపడుతుంది.

క్రీడాకారుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఉపాసన నాయకత్వం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఆధునిక క్రీడా సౌకర్యాలు,వెల్ఫేర్ పాలసీలు ఆమె పర్యవేక్షణలో అమలవుతాయి.

తెలంగాణ స్పోర్ట్స్ హబ్..

పనిచేసే విధానం: పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) ద్వారా నడుస్తుంది. నిధుల నిర్వహణ: తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (TSDF)ను పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఈ చొరవతో తెలంగాణ క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని ఆశిస్తున్నారు.

About Author