భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ ద్వారా టిటిడి డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: 2025 సంవత్సరానికి సంబంధించిన టిటిడి క్యాలెండర్లు,డైరీలను భక్తుల సౌకర్యార్థం టిటిడి ఆన్‌లైన్‌లో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: 2025 సంవత్సరానికి సంబంధించిన టిటిడి క్యాలెండర్లు,డైరీలను భక్తుల సౌకర్యార్థం టిటిడి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఈ డైరీలు, క్యాలెండర్లు టిటిడి ఎంపిక చేసిన ప్రాంతాలలో, అలాగే టిటిడి వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

2025 సంవత్సరం కోసం 12 పేజీల, 6 పేజీల, టేబుల్-టాప్ క్యాలెండర్లు, డీలక్స్ డైరీలు, చిన్న డైరీలు, శ్రీవేంకటేశ్వర స్వామి,శ్రీపద్మావతి అమ్మవారి కలిపిన క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్, అలాగే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కళ్యాణ మండపాల్లో కూడా లభ్యమవుతాయి.

అంతేకాకుండా, టిటిడి వెబ్‌సైట్ (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న భక్తులకు, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే డైరీలు మరియు క్యాలెండర్లను అందించడాన్ని టిటిడి కొనసాగిస్తుంది.

భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని, ఆన్‌లైన్‌లో టిటిడి డైరీలు, క్యాలెండర్లు నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.

About Author