టాటా ప్లే బంజ్‌లో బీబీసీ ప్లేయర్ తో అత్యుత్తమ బ్రిటిష్ వినోదం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి, 15 ,మే ,2025: టాటా ప్లే బింజ్ బీబీసీ స్టూడియోస్ మధ్య ఓ కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందంతో టాటా ప్లే బింజ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి, 15 ,మే ,2025: టాటా ప్లే బింజ్ బీబీసీ స్టూడియోస్ మధ్య ఓ కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందంతో టాటా ప్లే బింజ్ వినియోగదారులు ఇప్పుడు బీబీసీ ప్లేయర్ ద్వారా ప్రఖ్యాత బ్రిటిష్ షోలు, డాక్యుమెంటరీలు, డ్రామాలు, కామెడీలు బాలల ప్రోగ్రామ్‌లను వీక్షించే అవకాశం పొందుతున్నారు.

బీబీసీ ప్లేయర్‌లో “లూథర్”, “డాక్టర్ హూ”, “ప్రైడ్ అండ్ ప్రిజుడైస్”, “టాప్ గేర్”, “మిస్టర్ బీన్” వంటి ప్రముఖ టైటిళ్లతో పాటు, “ది గ్రేట్ బ్రిటిష్ బేక్ ఆఫ్”, “సిటిజెన్ ఖాన్” వంటి ప్రేక్షకుల అభిమాన సిరీస్‌లు ఉన్నాయి. ఆహార ప్రియుల కోసం “నిగెల్లాస్ కుక్, ఈట్, రిపీట్” “జేమీ ఓలివర్: కుకింగ్ ఫర్ లెస్” వంటి షోలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పిల్లల కోసం “ఆండీస్ అక్వాటిక్ అడ్వెంచర్”, “జోజో అండ్ గ్రాన్ గ్రాన్”, “జూనియర్ బేక్ ఆఫ్” వంటి ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందిస్తోంది. అదే సమయంలో, సహజ చరిత్రపై ఆధారిత డాక్యుమెంటరీ “ప్లానెట్ ఎర్త్ III” కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో లభ్యం.

ఈ భాగస్వామ్యంపై టాటా ప్లే చీఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ పల్లవి పూరి మాట్లాడుతూ, “ప్రపంచ ప్రఖ్యాత కంటెంట్‌ను ఒకే చోట అందించాలన్న మా లక్ష్యాన్ని బీబీసీతో కలిసి మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నాం,” అని చెప్పారు.

బీబీసీ స్టూడియోస్ సౌత్ ఏషియా డిస్ట్రిబ్యూషన్ హెడ్ స్టాన్లీ ఫెర్నాండ్స్ మాట్లాడుతూ, “టాటా ప్లే బింజ్‌ ద్వారా భారతదేశ వ్యాప్తంగా బీబీసీ ప్లేయర్‌ను విస్తరించడంపై మేము సంతోషిస్తున్నాం. నాణ్యమైన బ్రిటిష్ వినోదాన్ని అందరికీ చేరువ చేస్తాం,” అని తెలిపారు.

ప్రస్తుతం టాటా ప్లే బింజ్‌లో 30కి పైగా ప్రముఖ OTT యాప్‌లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో యాపిల్ టీవీ+, జియోసినెమా, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్కవరీ+, ఆహా, హంగామా ప్లే, చౌపల్, స్టీజ్, డాక్యూబే, EPIC ON, TravelXP, ప్లేఫ్లిక్స్, BBC ప్లేయర్ మరియు మరెన్నో ఉన్నాయి. ఈ అన్ని OTTల కంటెంట్‌ ను ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో, మొబైల్, టీవీ, డెస్క్‌టాప్, టాబ్లెట్‌ సహా అనేక డివైస్‌లలో వీక్షించవచ్చు.

About Author