జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, మే,హైదరాబాద్,12,2025:సినిమా రంగం వెలుగు వేషాల వెనక ఎన్నో కష్టాల జీవితాలు దాగి ఉన్నాయి. అటువంటి జీవితం గడుపుతున్న జూనియర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, మే,హైదరాబాద్,12,2025:సినిమా రంగం వెలుగు వేషాల వెనక ఎన్నో కష్టాల జీవితాలు దాగి ఉన్నాయి. అటువంటి జీవితం గడుపుతున్న జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి ఇప్పటి కాలంలో అవకాశాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ నటుడు కృష్ణసాయి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన కృష్ణసాయి, స్వయంగా పొట్టి జానీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “తెలుగు చిత్రసీమలో ప్రతి ఒక్కరూ ఇలాంటి కళాకారుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. ఇది నా బాధ్యత అనిపించి, నా వంతు సాయాన్ని చేశాను. ఇతర నటీనటులు, నిర్మాతలు కూడా ముందుకు రావాలి,” అని విజ్ఞప్తి చేశారు.

సుందరాంగుడు, జ్యువెల్ థీఫ్ వంటి చిత్రాల్లో హీరోగా కనిపించిన కృష్ణసాయి, రియల్ లైఫ్‌లోనూ నిజమైన హీరోగా నిలుస్తున్నారు. ఆయన స్థాపించిన కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా నిరుపేదలకు, అనాధలకు అండగా నిలుస్తూ, నిజమైన అపద్భాందవుడిగా నిలుస్తున్నారు.
కృష్ణసాయి చేసిన ఈ ఉదాత్తమైన పనికి సినీ వర్గాలు, సామాజిక వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. తెర మీద నటన కంటే తెర వెనుక చూపించే మానవత్వమే నిజమైన హీరోయిజం అని మరోసారి ఆయన నిరూపించారు.