టాటా పవర్ కీలక మైలురాయి.. 1.5 లక్షల పైగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు, 3 GW సామర్థ్యంతో ముందడుగు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,మార్చి 24,2025: టాటా పవర్ రూఫ్‌టాప్ సోలార్ విభాగం మరో కీలక మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల పైగా రూఫ్‌టాప్ సోలార్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,మార్చి 24,2025: టాటా పవర్ రూఫ్‌టాప్ సోలార్ విభాగం మరో కీలక మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల పైగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేసింది. దీంతో దేశంలోనే నంబర్ వన్ రూఫ్‌టాప్ సోలార్ ప్రొవైడర్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మొత్తం రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం 3 గిగావాట్లకు (GW) చేరుకుంది.

టాటా పవర్ సోలార్ రూఫ్‌టాప్, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) లో భాగంగా పనిచేస్తూ, దేశ వ్యాప్తంగా 700కి పైగా నగరాల్లో విస్తరించింది. 80% విద్యుత్ బిల్లుల తగ్గింపు, 25 ఏళ్ల వారంటీ, 4-7 ఏళ్ల పేబ్యాక్ వ్యవధి వంటి ప్రయోజనాలతో ‘టాటా పవర్ సోలారూఫ్’ పేరుతో వినియోగదారులకు సేవలందిస్తోంది. విద్యుత్ చార్జీలు సంవత్సరానికి 3-5% పెరుగుతుండగా, సోలార్ ఎర్నర్జీ వినియోగం దీని భారాన్ని తగ్గించగలదని కంపెనీ తెలిపింది. తమిళనాడులోని తన యూనిట్‌లో ALMM అప్రూవ్‌డ్ సోలార్ ప్యానెల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది.

ఫైనాన్సింగ్ సౌకర్యం, ప్రభుత్వ మద్దతు
సౌర విద్యుత్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా టాటా పవర్ 20కి పైగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో కలిసి ఫైనాన్సింగ్ సదుపాయం కల్పిస్తోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’, ‘ఘర్‌ఘర్ సోలార్’ వంటి కార్యక్రమాలకు టాటా పవర్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులకు ప్రత్యేకంగా అనుగుణమైన సొల్యూషన్లు అందిస్తోంది.

దేశవ్యాప్తంగా విస్తృత సేవా నెట్‌వర్క్
దేశవ్యాప్తంగా 300 నగరాల్లో 575 పైగా చానల్ పార్ట్‌నర్లు, 400+ నగరాల్లో 225 అధీకృత సర్వీస్ భాగస్వాములతో టాటా పవర్ సేవలందిస్తోంది. ఇప్పటికే 1.5 లక్షల మంది కస్టమర్లను కలిగి ఉండగా, వీరిలో 1.22 లక్షల మంది రెసిడెన్షియల్ వినియోగదారులే కావడం గమనార్హం. దీంతో, సోలార్ ఎనర్జీ వినియోగంలో టాటా పవర్ ప్రజలందరికీ నమ్మదగిన భాగస్వామిగా నిలుస్తోంది.

Read this also…Tata Power Achieves 1.5 Lakh+ Rooftop Solar Installations, 3 GW Capacity, Expands Presence in 700+ Cities

Read this also…Narayana Educational Institutions Launches 52 New Campuses Across 12 States

ప్రముఖ వేడుకల ద్వారా అవగాహన
రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని పెంపొందించేందుకు టాటా పవర్ ‘కుంభమేళా’, ‘ఛత్ పూజ’ తదితర ప్రాముఖ్యమైన వేడుకల్లో ప్రజల్లో అవగాహన కల్పించింది. 2025 జనవరిలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని ‘ఆప్‌కీ రూఫ్, ఆప్‌కీ తాకత్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజలను సొంత ఇళ్లపై సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహిస్తోంది.

భవిష్యత్‌లో మరింత దూకుడుగా..
సోలార్ రూఫ్‌టాప్ సేవలతోపాటు, సోలార్ ప్యానెల్ ఉత్పత్తిలోనూ టాటా పవర్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. 4.3 గిగావాట్ల సెల్ & మాడ్యూల్ ఉత్పత్తి సామర్థ్యంతో పాటు, ఇప్పటికే 3 గిగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తిచేసింది. దేశంలో స్వచ్ఛ ఇంధన మార్గంలో భారత్ వేగంగా ముందుకు సాగేందుకు టాటా పవర్ కీలక పాత్ర పోషిస్తోంది.

About Author