అబాట్ నూతన ఎన్‌షూర్ డయాబెటిస్ కేర్ ఆవిష్కరణ..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, నవంబర్ 14, 2025:ప్రపంచంలోని ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ అబాట్, డయాబెటిస్ రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన,...
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, నవంబర్ 14, 2025:ప్రపంచంలోని ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ అబాట్, డయాబెటిస్ రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన,...
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 22,2025: తల్లిదండ్రుల్లో ఎవరికైనా తలసీమియా మైనర్ ఉంటే, పిల్లలకు తలసీమియా మేజర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదకు తెచ్చే ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే, ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించుకోవడం, మందులు వాడడం ద్వారా పిల్లలను కాపాడుకోవచ్చు. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి, పిల్లలకు తలసీమియా సంబంధిత పరీక్షలు చేసేందుకు నగరంలోని కామినేని ఆస్పత్రిలో ఉచిత హెమటాలజీ శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, హెమటాలజిస్టు, జెనెటిక్ వైద్య నిపుణులు పాల్గొని పిల్లలకు పలు పరీక్షలు చేస్తారు. ఈ శిబిరంలో పాల్గొని, ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలనుకునేవారు 8985450534 అనే నంబరులో సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా పిల్లల వైద్యవిభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ ఎస్. నరసింహారావు మాట్లాడుతూ...“పిల్లలు ఎప్పుడూ అలసటగా, బలహీనంగా కనపడుతున్నా, ముఖం పసుపు లేదా తెల్లగా మారినా, ఎదుగుదల ఆలస్యంగా అనిపిస్తున్నా, పొట్ట ఉండాల్సిన దానికంటే పెద్దగా కనిపించినా, ముఖం ఎముకల ఆకృతి అసాధారణంగా మారినా, తరచు జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు వస్తున్నా, మూత్రం ముదురు రంగులో ఉంటున్నా వెంటనే తల్లిదండ్రులు గమనించి తలసీమియా సంబంధిత వైద్య పరీక్షలు చేయిచాలి” అని సూచించారు. ఈ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స ప్రారంభిస్తే పిల్లల ప్రాణాలు కాపాడగలమని ఆయన చెప్పారు. సమావేశంలో ఇంకా కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ కంచన్ ఎస్.చన్నావర్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్.జయంతి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రీనివాస్, జెనెటిక్స్, మాలిక్యులర్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనీ క్యూ హసన్, జెనెటిక్స్ కౌన్సిలర్ డాక్టర్ శ్రీలత కొమాండూర్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్.వివేకానంద్, ఇమ్యునోహెమటాలజీ, రక్తమార్పిడి విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అన్నే పునీత్ బాబు తదితరులు పాల్గొని.. పిల్లలందరికీ పూర్తి ఉచితంగా హెమోగ్లోబిన్, హెమోగ్లోబినోపతి స్క్రీనింగ్ (హెచ్పీఎల్సీ) పరీక్షలు చేస్తారు.
Varahi media.com online news, Hyderabad, May 22, 2025: If either parent is a carrier of Thalassemia Minor, there is a...
The new TVC talks about India’s growing health challenge with rising obesity rates. The campaign combines star power with practical...