శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి మోహినీ అలంకారం భక్తులకు దివ్య దర్శనం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 22,2025: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం ఉదయం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 22,2025: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనసేవలో ముందుగా భక్తులు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారి మహిమాన్వితాన్ని కొనియాడారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీ సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు పుష్పాలు చల్లి, కర్పూరహారతులతో తమ భక్తిని ప్రదర్శించారు.

మోహినీ అవతారం – భక్తులకు మోక్ష మార్గం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఈ రోజున మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. జగత్తును తన మాయా మోహంతో కట్టిపడేసే జగన్మోహినీ స్వరూపం భక్తులకు ఆధ్యాత్మిక స్పూర్తిని కలిగించేలా ఉంటుంది. స్వామివారి మోహినీ అవతారం భౌతిక మోహాన్ని తొలగించి, పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించే దివ్య సౌందర్య స్వరూపంగా భక్తులను అనుగ్రహిస్తుంది.

Read this also...SAM”MOHINI” MESMERIZES DEVOTEES AT SRINIVASA MANGAPURAM

ఇది కూడా చదవండి...మా అమ్మ అంజనమ్మ క్షేమంగానే ఉన్నారు : మెగాస్టార్ చిరంజీవి

Read this also...Megastar Chiranjeevi Dismissed Speculations About His Mother Anjanamma’s Health

ఇది కూడా చదవండి...హైదరాబాద్‌లో MG SELECT డీలర్‌గా జయలక్ష్మి మోటార్స్..

Read this also...MG SELECT Expands Luxury Automotive Retail with 12 New Dealer Partners Across India

రాత్రి గరుడ వాహనసేవ
రాత్రి 7 గంటల నుంచి శ్రీ స్వామివారు విశేషంగా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ వైభవోత్సవంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి మోహినీ రూప దర్శనం చేసుకొని సంతృప్తి చెందారు.

About Author