ఆదిత్య బిర్లా గ్రూప్ ‘ఆద్యం’ బ్రాండ్ అంబాసిడర్‌గా శోభితా ధూళిపాళ..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, డిసెంబర్ 13, 2025: భారతదేశ చేనేత వారసత్వాన్ని పరిరక్షించేందుకు అంకితమైన ఆదిత్య బిర్లా గ్రూప్ కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, డిసెంబర్ 13, 2025: భారతదేశ చేనేత వారసత్వాన్ని పరిరక్షించేందుకు అంకితమైన ఆదిత్య బిర్లా గ్రూప్ కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం హ్యాండ్‌వోవెన్ (Aadyam Handwoven), నేడు ప్రముఖ నటి శోభితా ధూళిపాళను తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రకటించింది.
సాంస్కృతిక అభిరుచి కలిగిన నటిగా శోభితాకు ఉన్న పేరు, ‘కల్చర్ బియాండ్ టెక్స్‌టైల్స్’ (వస్త్రాలకు మించిన సంస్కృతి) అనే ఆద్యం లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని సంస్థ పేర్కొంది.
చేనేత పనితనంపై కొత్త తరానికి మక్కువ పెంచడమే లక్ష్యం:
ఈ భాగస్వామ్యం గురించి ఆద్యం హ్యాండ్‌వోవెన్ బిజినెస్ లీడ్ మనీష్ సక్సేన మాట్లాడుతూ, “ఆద్యం ఎల్లప్పుడూ మగ్గం వెనుక ఉన్న వ్యక్తులకు, మన చేతి వృత్తులను రూపొందించే సంస్కృతులకు అండగా నిలుస్తుంది.
శోభిత నేటి కాలపు మహిళ. చేనేత వస్త్రాలతో ఆమెకున్న అనుబంధం వ్యక్తిగతమైనది, సహజమైనది. ఆమె మా ప్రచార కర్తగా నిలవటం, కొత్త తరం కోసం భారతీయ పనితనంను ప్రతి ఒక్కరూ అభిమానించేలా చేయాలనే మా ప్రయత్నాన్ని పునరుద్ఘాటిస్తుంది,” అని అన్నారు.
శోభితా ధూళిపాళ హర్షం..

ఈ గౌరవం పట్ల తన సంతోషాన్ని వెల్లడిస్తూ నటి శోభితా ధూళిపాళ మాట్లాడారు.
“కళ, భావోద్వేగాలను కలిగి ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఏదైనా చేతితో తయారు చేసినప్పుడు, అది దానిని సృష్టించిన వ్యక్తి ముద్రను కలిగి ఉంటుంది.
నేత సంఘాలతో ఆద్యం చేస్తోన్న కృషి, అన్ని రూపాల్లో సంస్కృతిని వేడుక జరుపుకునే సిద్దాంతంతో కలవడం వలన ఈ అనుబంధం నాకు చాలా ప్రత్యేకమైనదిగా మారింది,” అని ఆమె పేర్కొన్నారు.
ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన ఆద్యం హ్యాండ్‌వోవెన్, దేశంలోని నేత సంఘాలతో కలిసి పనిచేస్తూ, భారతదేశ అత్యుత్తమ చేతివృత్తులకు మద్దతునివ్వడం ద్వారా స్వయం సమృద్ధిగల పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యంతో కృషి చేస్తోంది.