ద్విచక్ర వాహనదారులకు షాకింగ్ న్యూస్: టోల్ బాదుడు తప్పదు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూ ఢిల్లీ, జూన్ 26, 2025: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ద్విచక్ర వాహనదారులకు ఇది ఒక ముఖ్యమైన వార్త. జూలై 15, 2025 నుండి జాతీయ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూ ఢిల్లీ, జూన్ 26, 2025: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ద్విచక్ర వాహనదారులకు ఇది ఒక ముఖ్యమైన వార్త. జూలై 15, 2025 నుండి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు ఉన్న టోల్ మినహాయింపును రద్దు చేయనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ నిర్ణయంతో ఇకపై టోల్ ప్లాజాల వద్ద బైక్ రైడర్లు కూడా టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక టోల్ చెల్లించాల్సిందే..!
ఇప్పటివరకు, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజుల నుంచి మినహాయింపు ఉంది. అయితే, మారుతున్న ట్రాఫిక్ పరిస్థితులు, రహదారుల నిర్వహణ వ్యయం పెరగడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి…ఐటీ సేవల భవిష్యత్తును మలిచేందుకు కోవాసంట్‌కు జాయిన్ అయిన టెక్ దిగ్గజుడు ఫణీష్ మూర్తి
ఇది కూడా చదవండి…యూఎస్‌కు చెందిన అలూకెమ్‌ను $125 మిలియన్లకు కొనుగోలు చేయనున్న హిందాల్కో..
Read This also…PhonePe and HDFC Bank Launch Co-Branded RuPay Credit Card with UPI Integration and Exciting Rewards
వచ్చే ఏడాది జూలై 15 నుంచి, హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద ద్విచక్ర వాహనదారులు కూడా తప్పనిసరిగా టోల్ చెల్లించాలి. ఇది ద్విచక్ర వాహనదారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది. టోల్ వసూలు పద్ధతులు, FASTag అమలు వంటి విషయాలపై త్వరలో మరిన్ని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం ద్విచక్ర వాహనాల అమ్మకాలపై, అలాగే రోజువారీ ప్రయాణ ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టోల్ చెల్లింపుల కోసం ద్విచక్ర వాహనాలకు కూడా FASTag తప్పనిసరి అవుతుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.