షణ్ముఖ’ – పవర్‌ఫుల్ డివోషనల్ థ్రిల్లర్ మూవీ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 21, 2025: ‘శాసనసభ’ సినిమా తర్వాత సాప్పని బ్రదర్స్ మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి ‘షణ్ముఖ’ అనే

సస్పెన్స్, థ్రిల్, డివోషనల్ ఎమోషన్ కలబోసిన కథ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 21, 2025: ‘శాసనసభ’ సినిమా తర్వాత సాప్పని బ్రదర్స్ మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి ‘షణ్ముఖ’ అనే డివోషనల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాకు షణ్ముగం సప్పని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించటం మరో ప్రత్యేకత.
కథ..
ఓ చిన్న గ్రామంలో విగాండ (చిరాగ్ జానీ) అనే వ్యక్తికి ఓ అబ్బాయి జన్మిస్తాడు. అతనికి అసాధారణంగా ఆరు ముఖాలు ఉంటాయి. ఈ శాపం నుండి విముక్తి పొందేందుకు మాంత్రికుడు చేసిన సూచనలతో విగాండ అమ్మాయిలను బలి ఇచ్చే దారికి వెళతాడు. అదే సమయంలో రీసెర్చ్ స్కాలర్ సారా (అవికా గోర్) ఈ మిస్టరీని ఛేదించేందుకు సిద్ధమవుతుంది. ఆమెకు సహాయంగా తన మాజీ ప్రియుడు, పోలీస్ ఆఫీసర్ కార్తీ (ఆది సాయికుమార్) చేరతాడు. చివరకు విగాండను అడ్డుకోగలిగారా? అతని కుట్రను భగ్నం చేసారా? అనేదే కథ.
Read this also…Women in Agribusiness Report: Addressing Gender Disparities in Agriculture
Read this also…Godrej Jersey Announces 3×3 Growth Strategy for FY26: Focus on Hero Categories, Market Expansion & Innovation
తొలి భాగం..
కథను షణ్ముగం సప్పని చక్కగా మలిచాడు. తొలి భాగం థ్రిల్లింగ్ మూడ్‌లో సాగగా, రెండో భాగం సస్పెన్స్ రివీల్స్, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్‌తో నడుస్తుంది. ముఖ్యంగా కిడ్నాప్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ట్రీట్‌మెంట్ ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా..
- రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం.
- ఆర్.ఆర్. విష్ణు కెమెరా పనితనం విజువల్స్‌కు గ్రాండ్ లుక్ ఇచ్చింది.
- ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ మెరుగుగా ఉంది.
- నిర్మాణ విలువలు స్క్రీన్‌పైనే కనిపించాయి.

నటీనటుల అభినయం..
ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌ను పోషించాడు. అవికా గోర్ తన పాత్రలో కొత్తదనం చూపించింది. చిరాగ్ జానీ విలన్‌గా భయపెట్టాడు. ఆదిత్య ఓం, షణ్ముగం సప్పని ఇతర పాత్రల్లో న్యాయం చేశారు.
ఇది కూడా చదవండి…భారతదేశం కోసం నివా బుపా ‘రైజ్’ – మిస్సింగ్ మిడిల్‌కు ప్రత్యేక ఆరోగ్య భద్రతా ప్రణాళిక
Read this also…Niva Bupa Launches ‘Rise’ for India’s “Missing Middle”
మొత్తంగా ‘షణ్ముఖ’ కథ, మ్యూజిక్, విజువల్స్ పరంగా ఆకట్టుకునే పవర్‌ఫుల్ థ్రిల్లర్ మూవీ.
విడుదల తేదీ: 21-03-2025
నటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా తదితరులు.
బ్యానర్: సాప్‌బ్రో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని
సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్. విష్ణు
ఎడిటర్: ఎంఏ మాలిక్
సంగీతం: రవి బస్రూర్
దర్శకుడు: షణ్ముగం సప్పని
ట్యాగ్ లైన్: 3:5