సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం – ధర రూ.1,09,999 నుంచి..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, మే 14: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ తాజాగా తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ “గెలాక్సీ ఎస్25 ఎడ్జ్”ను భారత మార్కెట్లో లాంఛనంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, మే 14: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ తాజాగా తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ “గెలాక్సీ ఎస్25 ఎడ్జ్”ను భారత మార్కెట్లో లాంఛనంగా ప్రవేశపెట్టింది. రూ.1,09,999 ప్రారంభ ధరతో లభ్యమవుతున్న ఈ ఫోన్‌కు ప్రీ-ఆర్డర్లను కంపెనీ ఈ రోజు నుంచే ప్రారంభించింది. అత్యాధునిక ఫీచర్లు, సన్నటి డిజైన్, ప్రో-లెవల్ కెమెరాతో సరికొత్త అనుభవాన్ని వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది.
స్టైల్‌కి, స్ట్రెంగ్త్‌కి సమతుల్యం
5.8ఎంఎం సన్నని చాసిస్‌తో వచ్చిన గెలాక్సీ ఎస్25 ఎడ్జ్, కేవలం 163 గ్రాములే బరువుతో ఉండి, ఫోన్ డిజైన్‌లో ఓ మైలురాయిగా నిలుస్తోంది. టైటానియం ఫ్రేమ్, మెరుగైన గ్లాస్ ప్రొటెక్షన్ (గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2)తో దీర్ఘకాలిక వినియోగానికి తగినట్టుగా రూపొందించారు.
కెమెరాలో క్రాంతి – 200ఎంపి సత్తా
ఈ ఫోన్లో 200ఎంపి వైడ్ లెన్స్, 12ఎంపి అల్ట్రా వైడ్ కెమెరాతో మరింత ప్రభావవంతమైన ఫోటోగ్రఫీకి అవకాశముంది. రాత్రి సమయంలోనూ అద్భుతమైన ఫోటోలు తీయగలిగేలా నైటోగ్రఫీని మెరుగుపరిచారు. ప్రో-విజువల్ ఇంజిన్, స్మార్ట్ ఎడిటింగ్ టూల్స్‌తో వినియోగదారుల సృజనాత్మకతను పదునుపెట్టేలా రూపొందించారు.
గెలాక్సీ ఏఐతో పర్ఫార్మెన్స్కు కొత్త పదం
ఈ డివైస్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి శక్తివంతమైన పనితీరును అందిస్తున్నారు. రీ-డిజైన్ చేసిన వాపర్ ఛాంబర్‌తో ఫోన్ వేడెక్కకుండా పనిచేస్తుంది. ఏఐ ఆధారిత ప్రాసెసింగ్‌తో వేగవంతమైన స్పందన, ఎనలేని మల్టీటాస్కింగ్ అనుభూతిని అందిస్తుందన్నారు.

ప్రైవసీతో పాటు ఏఐ అనుభవాలు
గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌లో ఉన్న గెలాక్సీ ఏఐ వినియోగదారుల రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. నౌ బ్రీఫ్, నౌ బార్ వంటి ఫీచర్లతో పాటు గూగుల్ జెమినీ లైవ్ ఇంటిగ్రేషన్ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తుంది. గోప్యతకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ, సామ్సంగ్ నాక్స్ సెక్యూరిటీతో డేటాను భద్రంగా ఉంచుతుంది.
ధరలు, ఆఫర్లు
గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ప్రీ-ఆర్డర్ చేస్తే రూ.12,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఉచితం. అదేవిధంగా, 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. టైటానియం సిల్వర్, టైటానియం జెట్‌బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
మరిన్ని వివరాలకు: Samsung.com