రివ్యూ : ప్రేమ, స్నేహం, వినోదం మేళవింపు.. సమ్మేళనం..

వారాహి మీడియా డాట్ కామ్, ఫిబ్రవరి 20, 2025: ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన సమ్మేళనం వెబ్ సిరీస్ ప్రేమ, స్నేహం, వినోదాల మేళవింపు. గణాదిత్య హీరోగా నటించగా, ప్రియా వడ్లమాని హీరోయిన్.

వారాహి మీడియా డాట్ కామ్, ఫిబ్రవరి 20, 2025: ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన సమ్మేళనం వెబ్ సిరీస్ ప్రేమ, స్నేహం, వినోదాల మేళవింపు. గణాదిత్య హీరోగా నటించగా, ప్రియా వడ్లమాని హీరోయిన్. విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, శ్రీకాంత్ యాచమనేని, బిందు నూతక్కి ప్రధాన తారాగణంగా నటించారు. తరుణ్ మహాదేవ్ దర్శకత్వం వహించగా, సునయన బి, సాకేత్ జె నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఓ లుక్ ఏద్దాం!

కథ సంగతేంటంటే…

Read this also..Axis Bank Hosts 9th Edition of Evolve in Hyderabad to Empower MSMEs

Read this also...Sri Kalyana Venkateswara Swamy’s Divine Blessings on Simha Vahanam

Read this also...Sri Kapileswara Swamy Blesses Devotees on Suryaprabha Vahanam

Read this also...Sri Padmavati Devi Blesses Devotees in Dhanalakshmi Alankaram on Kalpavriksha Vahanam

రచయిత రామ్ (గణాదిత్య) రాసిన పుస్తకం విశేష స్పందన పొందుతుంది. ఇది ప్రముఖ వార్తాపత్రికల దృష్టిని ఆకర్షించడంతో, శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విఘ్నయ్ అభిషేక్), మేఘన (ప్రియా వడ్లమాని) అతన్ని కలవడానికి వస్తారు.

అర్జున్, రామ్ చిన్ననాటి స్నేహితులు. రామ్ రచయిత కావాలనుకుంటాడు, అర్జున్ అతనికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తాడు. ఉద్యోగ స్థలంలో మేఘనను చూసి అర్జున్ ప్రేమలో పడతాడు. కానీ రామ్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. మరి, మేఘన ఎవరిని ప్రేమించింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎలాంటి మలుపులు వచ్చాయి? చివరకు ఎవరెవరికి కలిసారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది.

అనాలసిస్..

సమ్మేళనం ప్రేమ, స్నేహం, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించిన కుటుంబకథా వెబ్ సిరీస్. దర్శకుడు తరుణ్ మహాదేవ్, నిర్మాతలు సునయన-సాకేత్ మంచి ప్రయత్నం చేశారు.

“మాకు మాట్లాడే హక్కు ఉందా?” అనే పనిమనిషి ప్రశ్నకు, “రాజ్యాంగం హక్కు ఇచ్చింది, కానీ సమాజం దాన్ని తీసేసింది” అనే సమాధానం కథలో లోతైన భావాన్ని ప్రతిబింబిస్తుంది.

దర్శకుడు తెలుగు భాష సౌందర్యాన్ని, కవిత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు. “వేసవి వేడిలో తూర్పు గాలులు చల్లదనం తెస్తాయి” అనే ప్రియ వడ్లమాని డైలాగ్ గౌతమ్ మీనన్ సినిమాల టచ్ ను గుర్తు చేస్తుంది.

కథ రొటీన్ అయినా, హుక్ పాయింట్లు ఆకట్టుకుంటాయి. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించడం సగటు కథాంశం. అయితే, హీరోయిన్ చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ కథ ఆకర్షణీయంగా ఉంటుంది.

సాంకేతిక అంశాలు..

ఇది కూడా చదవండి...శ్రీ కపిలేశ్వర స్వామి వారి సూర్యప్రభ వాహన సేవ భక్తి శోభితంగా

ఇది కూడా చదవండి...శ్రీనివాసమంగాపురంలో సింహ వాహన సేవలో ఆకట్టుకున్న చండ మేళం, కోలాటం

Read this also...Bharti AXA Life Insurance Secures Strategic Investment from 360 ONE Asset to Accelerate Growth

యశ్వంత్ నాగ్ అందించిన పాటలు హాయిగా ఉంటాయి. శరవణ వాసుదేవన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా పనితనం, లైటింగ్, ఫ్రేమింగ్ మంచి అనుభూతిని కలిగిస్తాయి.

నటీనటుల ప్రదర్శన..

గణాదిత్య ఎమోషనల్ సీన్స్ బాగా చేసారు. ప్రియా వడ్లమాని తన పాత్రకు న్యాయం చేసింది. బిందు, శ్రీకాంత్ గుర్రం, విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ యాచమనేని తమ పాత్రలను బాగా పోషించారు.

ఈ వెబ్ సిరీస్ పాటలు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఓటీటీలో ఇలాంటి సంగీతాన్ని వినడం అరుదు. కథాంశం పెద్దగా కొత్తదనం లేకపోయినా, ప్రదర్శన పరంగా ఆకట్టుకుంటుంది. సమ్మేళనం కథ పరంగా పెద్దగా వినూత్నత లేకపోయినా, వినోదం, భావోద్వేగాల కలయికతో ఒక మధుర అనుభూతిని అందించే ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెబ్ సిరీస్. varahimedia.com రేటింగ్ 3.5.

About Author