“భారతదేశంలో అతిపెద్ద AI-Ready QE వర్క్‌ఫోర్స్ లక్ష్యంగా 600+ ఇంజినీర్లకు సర్టిఫికేషన్ ఇచ్చిన క్వాలిజీల్”..

కామ్ ఆన్ ఆన్ లైన్ న్యూస్,భారతదేశం, ఆగస్టు 22, 2025: పరిశ్రమలన్నింటినీ AI ఆధారిత మార్పు పునర్నిర్మిస్తున్న తరుణంలో, ఆధునిక క్వాలిటీ ఇంజనీరింగ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ ఆన్ లైన్ న్యూస్,భారతదేశం, ఆగస్టు 22, 2025: పరిశ్రమలన్నింటినీ AI ఆధారిత మార్పు పునర్నిర్మిస్తున్న తరుణంలో, ఆధునిక క్వాలిటీ ఇంజనీరింగ్ (QE),డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్వాలిజీల్ తన ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి పెద్ద ఎత్తున దృష్టి సారించింది.

ట్రైసెంటిస్ (టోస్కా, నియోలోడ్, qTest, డేటా ఇంటిగ్రిటీ),ఇతర AI-ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లలో 600 మందికి పైగా ఇంజనీర్లు సర్టిఫికేట్ పొందగా, వేగవంతమైన, తెలివైన, స్కేలబుల్ QE ఫలితాలను అందించగల భవిష్యత్-సిద్ధమైన వర్క్‌ఫోర్స్ ను కంపెనీ తయారుచేస్తోంది.

ప్రస్తుతం క్వాలిజీల్ భారత్, అమెరికాలోని తన గ్లోబల్ డెలివరీ సెంటర్లలో 850 మందికి పైగా నిపుణులను నియమించింది. ఆటోమేషన్, GenAI సాధనాలు సాంప్రదాయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఈ కాలంలో, మానవ-AI సహకారాన్ని బలోపేతం చేయడానికి లోతైన టెక్నికల్ స్కిల్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్వాలిజీల్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంది. 2028 నాటికి 1,200 కొత్త ఉద్యోగాలను సృష్టించడం కంపెనీ ప్రధాన లక్ష్యం.

ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నది QMentisAI – క్వాలిజీల్ రూపొందించిన ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్, పేటెంట్ పెండింగ్‌లో ఉన్న GenAI ప్లాట్‌ఫారమ్. ఇది ఎండ్-టు-ఎండ్ టెస్టింగ్ లైఫ్‌సైకిల్‌ను ఆటోమేట్ చేస్తూ, సాఫ్ట్‌వేర్ నాణ్యతను పెంచుతుంది, సంక్లిష్ట సిస్టమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది. “హ్యూమన్-ఇన్-ది-లూప్” మోడల్ ద్వారా AI అవుట్‌పుట్‌ను మానవ నిపుణులు ధృవీకరించే విధంగా రూపకల్పన చేయబడింది.

క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు, CEO కళ్యాణ్ కొండా మాట్లాడుతూ:
“అప్‌స్కిల్లింగ్ ఇప్పుడు ఒక ఐచ్చిక కార్యక్రమం కాదు, వృద్ధికి అవసరమైన ప్రధాన అడ్డుగోడ. నిరంతర నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, మేము మా ఉద్యోగులను AI యుగంలో ముందుండేలా తీర్చిదిద్దుతున్నాం. మానవ సృజనాత్మకతే నిజమైన ఆవిష్కరణకు మూలం. రాబోయే సంవత్సరాల్లో కొత్త మార్కెట్లు, వ్యాపార విభాగాల్లో విస్తరించడమే కాకుండా, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచడమే మా లక్ష్యం.”

About Author