నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 16,2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 16,2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణించారని తెలిసి చింతిస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. “సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని తెపిపారు.

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నాను. రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ కి, కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలుపుతున్నాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెపిపారు.