జమ్మూ కాశ్మీర్‌లో పలు చోట్ల డ్రోన్ల తో పాక్ దాడులు, తిప్పికొట్టిన భారత సైన్యం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీనగర్, మే 8, 2025 : జమ్మూ అండ్ కాశ్మీర్‌లో పాకిస్తాన్ వరుస దాడులకు పాల్పడటంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్తాన్ అత్యాధునిక డ్రోన్‌లు ,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీనగర్, మే 8, 2025 : జమ్మూ అండ్ కాశ్మీర్‌లో పాకిస్తాన్ వరుస దాడులకు పాల్పడటంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్తాన్ అత్యాధునిక డ్రోన్‌లు , మిస్సైళ్లను ఉపయోగించి జమ్మూ, అఖ్నూర్, సాంబా,కతువా ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా పలు నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
పాకిస్తాన్ చర్యలకు దీటుగా భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” పేరుతో ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత బలగాలు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

భారత సైన్యం సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు తగిన విధంగా బదులిస్తోంది. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి, పౌరుల రక్షణకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాయని అధికారులు తెలిపారు.
This is also read.. Lakshmi’s Salon & Academy Inaugurates First Branch in RK Puram, Kothapet, Hyderabad
This is also read..LG Electronics India Begins Construction of Third Manufacturing Facility in Sri City, Andhra Pradesh
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది. భద్రతా బలగాలు ప్రజల సంపూర్ణ రక్షణ కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని భరోసా ఇచ్చారు.