కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ, మరణాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ, మరణాలు పెరుగుతున్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది.
ఈ విషయంపై గంభీరంగా స్పందించిన ఆయన, తాబేళ్ల మరణానికి కారణాలు తెలుసుకోవాలని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వన్యప్రాణుల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌధురిని ఆదేశించారు.
తక్షణమే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని, సముద్ర జీవుల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉప ముఖ్యమంత్రి గారు సూచించారు.