ఏఐ డేటా సెంటర్ల బడా బడి… టీసీఎస్–టీపీజీ రూ.16 వేల కోట్ల ఒడంబడిక!
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, నవంబర్ 21,2025: భారత్‌ను ప్రపంచ ఏఐ హబ్‌గా మార్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బ్రహ్మాండమైన అడుగు వేసింది. దేశవ్యాప్తంగా
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, నవంబర్ 21,2025: భారత్‌ను ప్రపంచ ఏఐ హబ్‌గా మార్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బ్రహ్మాండమైన అడుగు వేసింది. దేశవ్యాప్తంగా గిగావాట్ స్థాయి సామర్థ్యం ఉన్న అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ల నెట్‌వర్క్ నిర్మాణానికి అమెరికా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టీపీజీ (TPG)తో చేతులు కలిపింది. మొత్తం ప్రాజెక్టు వెచ్చం 2 బిలియన్ డాలర్లు – అంటే సుమారు రూ.16,500 నుంచి రూ.18 వేల కోట్లు!
ఈ భారీ మొత్తంలో సగం (1 బిలియన్ డాలర్లు ≈ రూ.8,250 కోట్లు) టీపీజీే భరించనుంది. మిగతా సగం టీసీఎస్ వేయనుంది. ఈ భాగస్వామ్య ప్రాజెక్టుకు ‘హైపర్‌వాల్ట్’ (HyperVault) అని పేరు పెట్టారు.
హైపర్‌వాల్ట్ ప్రత్యేకతలు…
- గిగావాట్ స్థాయి విద్యుత్ సామర్థ్యం
- అత్యంత సాంద్రత ఉన్న ఏఐ క్లస్టర్లకు మద్దతు
- లిక్విడ్ కూలింగ్ సాంకేతికతతో అత్యాధునిక డిజైన్
- దేశీయ కంపెనీలు, ప్రభుత్వ శాఖలు, హైపర్‌స్కేలర్లు (AWS, Google, Microsoft లాంటి దిగ్గజాలు), అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు

కొత్త జాయింట్ వెంచర్…
ఈ ప్రాజెక్టు కోసం ‘హైపర్‌వాల్ట్ ఏఐ డేటా సెంటర్ లిమిటెడ్’ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. → టీసీఎస్‌కు 51% మెజారిటీ వాటా + పూర్తి నిర్వహణ నియంత్రణ → టీపీజీకి 49% వాటా
భారత్‌లో ఏఐ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ హైపర్‌వాల్ట్ సెంటర్లు దేశానికి కీలకమైన కంప్యూటింగ్ శక్తిని సమకూర్చనున్నాయి. దీనితో భారత్ ప్రపంచ ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదగనుందని నిపుణుల అంచనా.
ఈ ఒప్పందంతో టీసీఎస్ మరోసారి తన దూకుడు నిరూపించుకుంది… ఇక భారత ఐటీ రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైందని చెప్పొచ్చు..