ఘనంగా లైషా ఉత్సవ్ – మహిళా శక్తికి గౌరవ వేదిక

వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 25, 2025 : మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కుని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320A ఆధ్వర్యంలో “లైషా ఉత్సవ్” సికింద్రాబాద్‌లోని లయన్స్ భవన్ లో అత్యంత ఘనంగా నిర్వ హించారు. మహిళా శక్తికి గౌరవ వేదికగా నిలిచిన ఈ వేడుకలో ప్రముఖ లయన్ సభ్యులు పాల్గొని, మహిళా సాధికారతపై తమ ఆలోచనలను పంచుకున్నారు.

వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 25, 2025 : మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కుని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320A ఆధ్వర్యంలో “లైషా ఉత్సవ్” సికింద్రాబాద్‌లోని లయన్స్ భవన్ లో అత్యంత ఘనంగా నిర్వ హించారు. మహిళా శక్తికి గౌరవ వేదికగా నిలిచిన ఈ వేడుకలో ప్రముఖ లయన్ సభ్యులు పాల్గొని, మహిళా సాధికారతపై తమ ఆలోచనలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి లయన్ డి.వి.ఎస్ లక్ష్మి (MJF) ముఖ్య అతిథిగా హాజరై, “లైషా ఉత్సవ్ మహిళా శక్తికి గౌరవ వేదిక” అని అభిప్రాయపడ్డారు. గౌరవ అతిథులుగా లయన్ గీతా దీపా రెడ్డి (MJF), లయన్ ప్రభావతి (MJF), లయన్ డా. హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణ వేణి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లయన్ రేఖా జహూర్కర్ (MJF) మాట్లాడుతూ, “స్త్రీ సమ్మాన్ – మహిళా ఉత్సవ్, ఛూయే ఆస్మాన్” నినాదంతో ఈ వేడుక ఎంతో ఉత్సాహభరితంగా, అర్థవంతంగా సాగిందని పేర్కొన్నారు.

మహిళా శక్తికి ప్రేరణ – లయన్ డి.వి.ఎస్ లక్ష్మి
ఈ సందర్భంగా ముఖ్య అతిథి లయన్ డి.వి.ఎస్ లక్ష్మి మాట్లాడుతూ, “ఒక్క మహిళ ఎదుగుదల అంటే ఒక కుటుంబ అభివృద్ధి. ఈ ఉత్సవం మహిళా శక్తిని వెలుగులోకి తెచ్చి, వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించడానికి గొప్ప వేదికగా నిలిచింది” అని అన్నారు.

ఈసందర్భంగా నటి రోజా రమణితో పాటు పలువురు ప్రతిభావంతులైన మహిళలను సన్మానించారు. అదనంగా, వంటల పోటీలు, ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతుల పంపిణీ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి..ఆన్‌లైన్ యాడ్స్‌పై డిజిటల్ పన్ను రద్దు – ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి!

Read this also…Major Factors Contributing to Rupee Depreciation

స్త్రీ గౌరవం – మహిమ.. గౌరవ అతిథి లయన్ గీతా దీపా రెడ్డి మాట్లాడుతూ, “స్త్రీ గౌరవం సమాజ మహిమకు ప్రతిబింబం. ప్రతి మహిళ తన ఎదుగుదల కోసం సమాన అవకాశాలను పొందాలి” అని అన్నారు.

కార్యక్రమ నిర్వాహకురాలిగా లయన్ టి. నైనాదేవి (MJF), సహ నిర్వాహకురాలిగా లయన్ లక్ష్మి సోమయాజులు (MJF) వ్యవహరించారు. లయన్ కె. శోభావతి (PMJF), లయన్ సంజుక్తా సేన్ కార్యక్రమ నిర్వహణలో సమగ్రంగా వ్యవహరించి, వేడుకను విజయవంతం చేశారు.

మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు..


ఈ వేడుక మహిళల సామర్థ్యం, సృజనాత్మకత, సమాజ సేవపై నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320A, మహిళల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

About Author