కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తి – త్వరలో RC 16 సెట్స్‌లో జాయిన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 5,2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,సంచలన దర్శకుడు బుచ్చి బాబు సాన కలసి తెరెక్కిస్తున్న భారీ చిత్రం RC 16 (వర్కింగ్ టైటిల్) కోసం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 5,2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,సంచలన దర్శకుడు బుచ్చి బాబు సాన కలసి తెరెక్కిస్తున్న భారీ చిత్రం RC 16 (వర్కింగ్ టైటిల్) కోసం కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తయింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివన్న ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Read this also…Karunada Chakravarthy Shiva Rajkumar Completes Look Test for Ram Charan’s RC 16; Gears Up to Join the Shoot Soon

Read this also…Pawan Kalyan Announces Konidela Naga Babu as MLC Candidate

ఇటీవలే జరిగిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, త్వరలోనే శివన్న షూటింగ్‌లో పాల్గొననున్నారు. శివన్న తన విశిష్టమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని చిత్రబృందం భావిస్తోంది.

RC 16 షూటింగ్ 2024లో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ గత నవంబర్‌లో మైసూర్‌లో జరగ్గా, తాజాగా హైదరాబాద్‌లో మరో ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఈ చిత్రంలో జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు సహా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇది కూడా చదవండి..ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్

Read this also...Blue Star Unveils 150 New Room AC Models, Strengthens Presence in Smart WiFi & Heavy-Duty Segments

సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరా వర్క్‌ను చేపట్టారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు.

About Author