“కలివి వనం”: ప్రకృతికి నివాళిగా ఒక సరికొత్త సినిమా ప్రయత్నం..!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 7, 2025: : “వృక్షో రక్షతి రక్షితః” అన్న పెద్దల మాటను నిజం చేస్తూ, ప్రకృతి సంరక్షణ ఆవశ్యకతను ప్రధానంగా చూపించేలా, స్వచ్ఛమైన తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో రూపుదిద్దుకున్న అరుదైన చిత్రం “కలివి వనం”. ఈ చిత్ర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 7, 2025: : “వృక్షో రక్షతి రక్షితః” అన్న పెద్దల మాటను నిజం చేస్తూ, ప్రకృతి సంరక్షణ ఆవశ్యకతను ప్రధానంగా చూపించేలా, స్వచ్ఛమైన తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో రూపుదిద్దుకున్న అరుదైన చిత్రం “కలివి వనం”. ఈ చిత్ర టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో మీడియా ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా ఆవిష్కరించారు.

ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, రాజ్ నరేంద్ర రచన, దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. నాగదుర్గ ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

Read This also…LEAD Group Empowers Students Nationwide with Real-World Problem Solving Through Young Leaders Program

Read This also…ICICI Prudential Life Disburses Over ₹900 Crore in Loans Against Traditional Policies in FY2025..

ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి జర్నలిస్ట్ టీ.ఎఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, జర్నలిస్ట్ టీ.ఎఫ్.జె.ఏ. వైస్ ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు జ్యూరీ మెంబర్ లక్ష్మీ నారాయణ, సినీజోష్ సీఈఓ రాంబాబు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, దుష్చర్ల సత్యనారాయణ వంటి పలువురు మీడియా, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

టీజర్ విడుదల వేడుకలో ..
ఈ సందర్భంగా దుష్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, “పంచభూతాలతో పాటు చెట్టు కూడా ప్రకృతి తల్లి స్వరూపమే. వనాలు బాగుంటేనే జనాలు బాగుంటారు. అభివృద్ధి పేరుతో చెట్లను నరకడం అన్యాయం. ‘కలివి వనం’ చిత్రంతో పర్యావరణం గురించి అద్భుతమైన సందేశాన్ని అందించారు. ఈ సినిమా మన సమాజానికి ఒక కొత్త మార్గాన్ని చూపాలి, పర్యావరణ రక్షణపై ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలి,” అని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సంగీత దర్శకుడు మదీన్ ఎస్.కె. మాట్లాడుతూ, “నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శకుడు రాజ్ అన్నకు, నిర్మాతలు మల్లికార్జున్, విష్ణువర్ధన్ రెడ్డిలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పెద్దగా మాట్లాడకపోయినా, నేను కంపోజ్ చేసిన టీజరే నా పనితనం గురించి చెబుతుందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించడానికి నా వంతు కృషి చేశాను. నేను అడగ్గానే పాట రాసిన కాసర్ల శ్యామ్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు,” అని తెలిపారు.

నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ, “‘కలివి వనం’ ఒక సామాజిక స్పృహతో రూపొందించిన చిత్రం. ‘బలగం’ సినిమాతో నాకు ఎంత పేరు వచ్చిందో, ఈ చిత్రానికి కూడా అలాంటి గుర్తింపే వస్తుందని ఆశిస్తున్నా. షూటింగ్ సమయంలో దర్శకుడు తనకు కావాల్సిన ఔట్‌పుట్ వచ్చే వరకు ఎంతో కష్టపడ్డారు. అడవుల్లో, గుట్టల్లో షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభవం. ప్రకృతి కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా,” అని చెప్పారు.

నటుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ, “అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందామనే గొప్ప కాన్సెప్ట్‌తో దర్శకుడు రాజ్ ‘కలివి వనం’ సినిమాను రూపొందించారు. ఈ బృందంతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ చిత్రంలో నేనొక ముఖ్యమైన పాత్రను పోషించాను. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి రివార్డులతో పాటు అవార్డులు కూడా దక్కాలని ఆశిస్తున్నా. ‘కలివి వనం’ సినిమాకు మీ అందరి సహకారం కావాలి,” అని కోరారు.

చిత్ర బృందం మాటల్లో..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ మాట్లాడుతూ, “ప్రకృతిని కాపాడుకోవాలి అనే గొప్ప కాన్సెప్ట్‌తో దర్శకుడు రాజ్ నరేంద్ర ‘కలివి వనం’ చిత్రాన్ని చేయడం అభినందనీయం. ఎవరికి వీలైన మార్గాల్లో వారు మన ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా,” అని తెలిపారు.

నటుడు ఖయ్యూం మాట్లాడుతూ, “దర్శకుడు రాజ్ నరేంద్ర మొదటి హీరోను నేనే. 12 ఏళ్లుగా మేము స్నేహితులుగా ఉన్నాం. ‘కలివి వనం’ లాంటి సినిమాను రూపొందించడం రాజ్ కే సాధ్యం. యాక్షన్, లవ్, రొమాంటిక్ వంటి చాలా జానర్‌ల సినిమాలు చూస్తుంటాం. కానీ ఈ సినిమాను మంచి ‘ఆర్గానిక్ మూవీ’ అని చెప్పగలను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా,” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, “దర్శకుడు రాజ్ లాగే నాకు కూడా చెట్లంటే చాలా ఇష్టం. అందుకే ‘కలివి వనం’ సినిమాను నిర్మించాను. ఈ రోజు మా సినిమా టీజర్ లాంఛ్‌కు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ చిత్రం ఈ రోజు ఇంత చక్కగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం చాలా ఆనందంగా ఉంది,” అని పేర్కొన్నారు.

నిర్మాత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ రోజు మా ‘కలివి వనం’ సినిమా టీజర్ లాంఛ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మా సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారు. వారి సహకారంతో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ మా సినిమా టీమ్ తరపున ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం,” అని తెలిపారు.

నటీనటుల అనుభవాలు
నటి నాగ దుర్గ మాట్లాడుతూ, “పర్యావరణం బాగుండాలని చెప్పే మంచి సందేశమున్న సినిమా ‘కలివి వనం’. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అందుకు మా డైరెక్టర్ రాజ్ గారికి ధన్యవాదాలు. అలాగే నిర్మాతలు మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లేకుంటే ఇలాంటి మూవీ నిర్మాణమయ్యేది కాదు. మా దర్శక నిర్మాతల వల్లే ‘కలివి వనం’ మీ ముందుకు వస్తోంది,” అని అన్నారు.

నటి బలగం విజయలక్ష్మి మాట్లాడుతూ, “వనాలను కాపాడుకోవాలి, జనాలను రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు రాజ్ నరేంద్ర గారు ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నాకొక ముఖ్యమైన పాత్రను ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించి చెట్లను కాపాడాలని కోరుతున్నా,” అని విజ్ఞప్తి చేశారు.

About Author