జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్ ₹2,000 కోట్ల ఐపీవో కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 2,2025: నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ రంగంలో భారత్‌లో అగ్రగామిగా ఉన్న జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 2,2025: నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ రంగంలో భారత్‌లో అగ్రగామిగా ఉన్న జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హేరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. 2022-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆదాయ పరంగా దేశంలోనే అతిపెద్ద, అత్యంత వేగంగా ఎదుగుతున్న నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ కంపెనీగా జైన్ రిసోర్స్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

ఈ ఐపీవో ద్వారా మొత్తం ₹2,000 కోట్లు సమీకరించనుండగా, ఇందులో ₹500 కోట్ల వరకు తాజా షేర్ల జారీ ఉంటే, మిగిలిన ₹1,500 కోట్ల విలువైన షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు.

Read this also…Jain Resource Recycling Limited Submits DRHP to SEBI for ₹2,000 Crore IPO

ఇది కూడా చదవండి..‘కమిటీ కుర్రోళ్లు’ విజయం తర్వాత నిహారిక కొణిదెల కొత్త సినిమా – సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో!

జైన్ ₹1,430 కోట్ల షేర్లను విక్రయించనుండగా, ఇతర షేర్‌హోల్డర్ మయాంక్ పరీక్ ₹70 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. ఈ సమీకరించిన నిధులను కంపెనీ రుణాల చెల్లింపులు, వ్యాపార విస్తరణ మరియు ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.

దాదాపు 70 ఏళ్ల ఘన వారసత్వంతో, జైన్ రిసోర్స్ నాన్-ఫెర్రస్ మెటల్ స్క్రాప్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా అధునాతన ఉత్పత్తులను తయారు చేస్తోంది. అంతేకాక, లండన్ మెటల్ ఎక్స్చేంజ్ (LME) లో లీడ్ ఇన్‌గోట్ బ్రాండ్‌ను లిస్ట్ చేసిన దేశంలోని అరుదైన రెండు రీసైక్లింగ్ కంపెనీల్లో ఇది ఒకటి.

కంపెనీ రూ. 100 కోట్ల వరకు ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ జరిగితే, ఆ మొత్తం తాజా ఇష్యూలో నుంచి తగ్గించబడుతుంది.

Read this also…Niharika Konidela’s Next: Sangeeth Shoban Leads

Read this also…Raymond Limited Signs 6th Major Joint Development Agreement for Residential Project in Wadala, Mumbai

ఈ ఇష్యూలో, ప్రమోటర్ కమలేష్

ఈ ఐపీవోకు డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, పీఎల్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

వాణిజ్య వర్గాల్లో ఈ ఐపీవోపై భారీ ఆసక్తి నెలకొంది.
పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు!

About Author