‘డిజైన్డ్ ఫర్ సుకున్’ కొత్త గుర్తింపును ఆవిష్కరించిన హింద్‌వేర్..!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 1, 2025: భారతదేశంలోని ప్రముఖ బాత్‌వేర్, టైల్స్, కన్స్యూమర్ అప్లయన్సెస్ బ్రాండ్‌గా ఉన్న హింద్‌వేర్ తన కొత్త బ్రాండ్ గుర్తింపును

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 1, 2025: భారతదేశంలోని ప్రముఖ బాత్‌వేర్, టైల్స్, కన్స్యూమర్ అప్లయన్సెస్ బ్రాండ్‌గా ఉన్న హింద్‌వేర్ తన కొత్త బ్రాండ్ గుర్తింపును ‘డిజైన్డ్ ఫర్ సుకున్’ (Designed for Sukun) పేరుతో ఆవిష్కరించింది. ‘సుకున్’ అంటే శాంతి లేదా ప్రశాంతత అని అర్థం.

క్యాంపెయిన్ సారాంశం..

ఈ కొత్త క్యాంపెయిన్ ద్వారా, హింద్‌వేర్ తమ ఉత్పత్తులు ఇంటిని కేవలం ఉపయోగించే స్థలం కాకుండా, మనసు ,శరీరానికి ప్రశాంతత, సౌకర్యం ఇచ్చే ప్రదేశంగా మారుస్తాయని తెలియజేస్తోంది. వినియోగదారులతో భావోద్వేగ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం ఈ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం.

కొత్త ఉత్పత్తులలో ‘సుకున్’..

హింద్‌వేర్ తమ కొత్త ఉత్పత్తులలో ఈ ‘సుకున్’ భావనను పొందుపరిచింది.. వర్షపు చినుకుల్లా అనుభూతినిచ్చే మల్టీఫంక్షన్ షవర్ విత్ థర్మోస్టాట్. వెచ్చదనం ఇచ్చే హీట్ ఫంక్షన్‌తో కూడిన స్మార్ట్ WC. ప్రేమతో కూడిన ప్రశాంతతను అందించే IoT సెన్సార్ విత్ మ్యాక్స్ స్మార్ట్ టెక్నాలజీ.

అందమైన, బలమైన ప్రీమియం టైల్స్..

హింద్‌వేర్ లిమిటెడ్ CEO నిరుపం సహాయ్ మాట్లాడుతూ, తమ ప్రయత్నం కేవలం ఉత్పత్తులను తయారు చేయడం కాదని, ఇన్నోవేషన్, ఉత్తమ డిజైన్‌ల కలయికతో ప్రజల జీవితాన్ని మెరుగుపరచే పరిష్కారాలను అందించడమేనని తెలిపారు. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఇల్లు శాంతి, సౌకర్యం, ,శ్రద్ధ నిండిన ‘అత్యుత్తమ ఇల్లుగా’ మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ‘డిజైన్డ్ ఫర్ సుకున్’ క్యాంపెయిన్ టీవీ, ఓటిటి, డిజిటల్, ప్రింట్, సినిమా, సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టీవీసీ లింక్:https://youtu.be/HNudhbfniec?si=HZ3C9kbbtFxwN821

About Author