ముమెంటం ఇండెక్స్ ఫండ్స్‌కు పెరుగుతున్న ఇన్వెస్టర్ల ఆసక్తి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా,7 మార్చి, 2025:ఫ్యాక్టర్ ఆధారిత ఇండెక్స్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ముమెంటం ఇన్వెస్టింగ్ మరింత ప్రాచుర్యం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా,7 మార్చి, 2025:ఫ్యాక్టర్ ఆధారిత ఇండెక్స్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ముమెంటం ఇన్వెస్టింగ్ మరింత ప్రాచుర్యం పొందుతోంది. మ్యుచువల్ ఫండ్స్ నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ప్రస్తుతం 31 ఫ్యాక్టర్ ఆధారిత సూచీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ముమెంటం, తక్కువ మార్తాంశం, వ్యాల్యూ వంటి ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. చారిత్రాత్మకంగా రాబడులపై ప్రభా చూపే ఈ అంశాల ఆధారంగా స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడమే దీని ప్రత్యేకత. ఉదాహరణకు, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ అనేది నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీలోని టాప్ 50 స్టాక్స్‌ను నార్మలైజ్డ్ ముమెంటం స్కోర్ (Normalized Momentum Score) ఆధారంగా ఎంపిక చేస్తుంది.
Momentum Index Funds Gain Popularity as Investors Embrace Factor Investing
ఇది కూడా చదవండి…మహిళా దక్షత సమితి ఆధ్వర్యంలో “కుంభమేళా: శాస్త్రం & ఆధ్యాత్మికత” పై ఉపన్యాసం
Read this also…VP Jagdeep Dhankhar Urges Indian Corporates to Invest in Specialized Educational Institutions
గత నాలుగు నెలలుగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ కాలంలో ప్రధాన సూచీలు ప్రతికూల రాబడులను నమోదు చేయడంతో గతంలో వచ్చిన లాభాలను కూడా కోల్పోయాయి. అయితే, మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్‌ను అనుసరించే ఇండెక్స్ ఫండ్స్ మాత్రం స్థిరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.

టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్ ముమెంటం ఇన్వెస్టింగ్లో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. 2024లో డిజిటల్ ,డైరెక్ట్ చానెల్స్ ద్వారా ఈ ఫండ్‌లోకి వచ్చే పెట్టుబడులు మూడింతలై సుమారు రూ. 500 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా, ఢిల్లీలో 2023లో రూ. 1.25 కోట్లుగా ఉన్న పెట్టుబడులు 2024లో రూ. 27 కోట్లకు పెరిగాయి. అదేవిధంగా, కొత్త PAN రిజిస్ట్రేషన్లు 15 నుంచి 169కి పెరిగాయి. కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలోనూ ఇదే విధంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. (మూలం: అంతర్గత డేటా)
“ముమెంటం ఇన్వెస్టింగ్ భావోద్వేగాలను పక్కన పెట్టి, స్థిరంగా పెరుగుతున్న ట్రెండ్లను అందిపుచ్చుకోవడంలో సహాయపడుతుంది. టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్ క్రమశిక్షణతో కూడిన వ్యూహాన్ని అందించడంతో పాటు, రిస్క్ ,రివార్డ్‌ల మధ్య సమతౌల్యాన్ని నెలకొల్పుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈ వ్యూహానికి కేటాయించాలని పరిశీలించవచ్చు” అని టాటా అసెట్ మేనేజ్మెంట్లో ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ ఆనంద్ వరదరాజన్ తెలిపారు.
Read this also…Gear Up for a Spy Action Thrill! Akhil Akkineni’s “Agent” Premieres on Sony LIV from March 14
Read this also…Mahila Dakshata Samithi Organizes Enlightening Lecture on “Kumbh Mela: A Union of Science and Spirituality”
2022 అక్టోబర్‌లో ప్రారంభమైన టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను మేనేజర్ కపిల్ మీనన్ నిర్వహిస్తున్నారు.
ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోరుకునే ఇన్వెస్టర్లు టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను ఒక ప్రయోజనకరమైన ఎంపికగా పరిశీలించవచ్చు.