శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా త్రిశూలస్నానం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఫిబ్రవరి 28,2025: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూలస్నానం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఫిబ్రవరి 28,2025: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి అన్నారావు సర్కిల్ వరకు ఊరేగింపుగా వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు ఆయనకు కర్పూర హారతులు సమర్పించారు.
Read this also...TTD to Recruit Under Sports Quota – Annual Sports Competitions Begin
Read this also...TRISHULA SNANAM PERFORMED AT SRI KAPILESWARA SWAMY TEMPLE
ఇది కూడా చదవండి...సింహ వాహన సేవలో శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు
అనంతరం ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానాన్ని నిర్వహించారు. స్వామివారి పవిత్ర ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం చేయడంతో పాటు, పూర్ణాహుతి, కలశోద్ధ్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రావణాసుర వాహనసేవ వైభవంగా నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి...టీటీడీ ఉద్యోగాల భర్తీకి స్పోర్ట్స్ కోటా – వార్షిక క్రీడాపోటీల ప్రారంభం
Read this also...Gromax Agri Equipment Celebrates 25 Years of Excellence Under Mahindra & Gujarat Government JV
Read this also...Canon India Introduces Free Camera Colour Matching App to Enhance Remote Video Production
రావణుడు అనేక శక్తులు, తపస్సంపన్నుడు అయినప్పటికీ పరస్త్రీ అపహరణ, శిష్టులైన దేవతలకు హాని చేయడం వంటి దుష్కర్మల కారణంగా రామబాణానికి హతుడయ్యాడు. అలాంటి రావణుడిని వాహనంగా స్వీకరించి శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు ప్రత్యేక దర్శనం ఇవ్వనున్నాడు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.