పుణె ప్లాంట్‌ను భారీగా విస్తరించనున్న జీఈ ఏరోస్పేస్ – $14 మిలియన్ల (సుమారు ₹120 కోట్లు) కొత్త పెట్టుబడి ప్రకటన..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పుణె, 20 నవంబర్ 2025: పుణెలోని తయారీ కేంద్రం పదో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమెరికాకి చెందిన జీఈ ఏరోస్పేస్ భారీ విస్తరణకు శ్రీకారం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పుణె, 20 నవంబర్ 2025: పుణెలోని తయారీ కేంద్రం పదో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమెరికాకి చెందిన జీఈ ఏరోస్పేస్ భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. మరో USD 14 మిలియన్ల (సుమారు ₹120 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతేడాది ప్రకటించిన మొత్తం USD 30 మిలియన్ల విస్తరణలో ఇది రెండో దశ.
ఈ నిధులతో అత్యాధునిక ఆటోమేషన్, అప్‌గ్రేడెడ్ తయారీ ప్రక్రియలు, కొత్త ఇంజిన్ భాగాల ఉత్పత్తి లైలన్లు ఏర్పాటు చేయనున్నారు.

“మేక్ ఇన్ ఇండియాకు మా బలమైన మద్దతు” – జీఈ ఏరోస్పేస్ పుణె MD పుణె తయారీ కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ విశ్వజిత్ సింగ్ మాట్లాడుతూ, “గత పదేళ్లలో పుణె టీమ్ అద్భుతమైన సామర్థ్యాలు నిర్మించుకుంది. దేశవ్యాప్తంగా 2,200కు పైగా సరఫరాదారుల్లో పుణె నుంచి మాత్రమే 300 మంది సరఫరాదారులతో కలిసి ప్రపంచంలోనే అత్యంత అధునాతన జెట్ ఇంజిన్ భాగాలను భద్రత, నాణ్యతతో సరఫరా చేస్తున్నాం. ఈ కొత్త పెట్టుబడి ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు, ప్రపంచ ఏరోస్పేస్ తయారీలో భారత్ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది” అని అన్నారు.
పదేళ్లలో పుణె కేంద్రం సాధించిన మైలురాళ్లు
- 5,000 మందికి పైగా ఉత్పత్తి సిబ్బందికి అత్యధునిక తయారీ శిక్షణ
- 300+ స్థానిక సరఫరాదారుల నెట్‌వర్క్
- ISO 14001 (పర్యావరణం) & ISO 45001 (సురక్షిత) సంస్థ) ధృవీకరణలు
- లీన్ ఆపరేటింగ్ మోడల్ ‘ఫ్లైట్ డెస్క్’ ద్వారా వ్యర్థాలు తగ్గింపు, ఉత్పాదకత పెంపు, లీడ్ టైమ్ తగ్గింపు
పుణె కేంద్రం నుంచి ప్రస్తుతం జీఈ ఏరోస్పేస్ అత్యంత అధునాతన వాణిజ్య జెట్ ఇంజిన్లకు (GE9X, LEAP సిరీస్‌లతో సహా) కీలక హై-టెక్ భాగాలు సరఫరా అవుతున్నాయి.
“భారత్‌లోనే తయారీ అయిన ఈ ప్లాంట్ ఇప్పుడు ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో కీలక భాగమైంది. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుంది” అని కంపెనీ వర్గాలు తెలిపాయి.