గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024: ‘కల్కి’కు ఉత్తమ చిత్రం, అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు..
వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 24, 2025: ప్రజాయుద్ధ కళాకారుడు గద్దర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులు-2024 విజేతలను జ్యూరీ చైర్‌పర్సన్, ప్రముఖ

వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 24, 2025: ప్రజాయుద్ధ కళాకారుడు గద్దర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులు-2024 విజేతలను జ్యూరీ చైర్‌పర్సన్, ప్రముఖ నటి జయసుధ గురువారం ఘనంగా ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం – తెలుగు సినిమా పరిశ్రమలో గద్దర్ స్ఫూర్తిని స్మరించుకోవడం, వారి సేవలకు ఘనతర్పించడమే.
ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ అవార్డును గెలుచుకుంది. జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ఈ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరగనుంది.
ప్రధాన అవార్డుల వివరాలు:
- ఉత్తమ చిత్రం: కల్కి
- రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్
- మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
- ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు
- ఫీచర్ హెరిటేజ్ అవార్డు: రజాకార్
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)
- ఉత్తమ నటి: నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
- ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
- ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ హాస్యనటులు: వెన్నెల కిషోర్, సత్య
- ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (దేవర)
- ఉత్తమ కథారచయిత: శివ పాలడుగు
- ఉత్తమ పుస్తకం: మన సినిమా పుస్తకం – రెంటాల జయదేవ్

ప్రత్యేక జ్యూరీ అవార్డులు:
- అనన్య నాగళ్ల (పొట్టేల్)
- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
- ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)
జయసుధ మాట్లాడుతూ, తెలుగు సినిమా వైభవాన్ని గుర్తించే విధంగా గద్దర్ స్ఫూర్తితో ఈ అవార్డులను అందిస్తున్నాం అని తెలిపారు. అలాగే, 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులు కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.