‘దేవిక & డానీ’ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన..!
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 8, 2025: జియో సినిమాలో ప్రసారమవుతున్న ‘దేవిక & డానీ’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 8, 2025: జియో సినిమాలో ప్రసారమవుతున్న ‘దేవిక & డానీ’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది.
అందాల తార రీతూ వర్మ ఓటీటీలోకి అరంగేట్రం చేసిన ఈ సిరీస్‌కు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ‘శ్రీకారం’ చిత్ర దర్శకుడు బి. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సూర్య వశిష్ఠ, శివ కందుకూరి హీరోలుగా నటించగా, సురేష్ ఎర్ర సహా నిర్మాతగా వ్యవహరించారు.
పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. రీతూ వర్మ పల్లెటూరి అమ్మాయిగా తన పాత్రలో ఒదిగిపోయింది. అందంగా కనిపించడమే కాకుండా, టీచర్‌గా ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే యువతిగా ఆమె నటన అద్భుతం అని చెప్పాలి. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోగా, శివ కందుకూరి పల్లెటూరి యువకుడి పాత్రకు చక్కగా సరిపోయాడు.

ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే, సుబ్బరాజు పల్లెటూరి పాత్రలో సరికొత్తగా కనిపించి మెప్పించారు. చాలా కాలం తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిపించి తమదైన మార్కును చూపించారు. ఈ సిరీస్ మొత్తానికి ఒక సరికొత్త అనుభూతిని అందించింది.
దర్శకుడు కిషోర్.బి ఈ సిరీస్‌ను చాలా ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విజయం సాధించారు. చక్కటి రివ్యూలు, రేటింగ్‌లతో పాటు పాజిటివ్ టాక్‌తో ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. జియో సినిమా (గతంలో జియో హాట్ స్టార్)లో స్ట్రీమింగ్ అవుతున్న ‘దేవిక & డానీ’ సిరీస్‌ను కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఆనందించవచ్చు.